డబ్బు ప్రభావిత ప్రాంతాలపై రిపోర్ట్​ ఇవ్వండి :  వల్లూరు క్రాంతి

డబ్బు ప్రభావిత ప్రాంతాలపై రిపోర్ట్​ ఇవ్వండి :  వల్లూరు క్రాంతి

గద్వాల, వెలుగు : వచ్చే ఎన్నికల్లో డబ్బు ప్రభావితం చేసే ప్రాంతాలపై రిపోర్ట్​ ఇవ్వాలని కలెక్టర్  వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్  మీటింగ్ హాల్ లో ఎక్సైజ్, పోలీస్  ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. గత ఎన్నికల్లో డబ్బు, గోల్డ్, సిల్వర్, లిక్కర్  పంపిణీపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2014, 2018 ఎన్నికల్లో ఏ ప్రాంతాల్లో డబ్బు, లిక్కర్, గోల్డ్  పంపిణీ చేశారనే విషయంపై రిపోర్ట్​ ఇవ్వాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఒకే అకౌంట్  నుంచి ఎక్కువ ట్రాన్సాక్షన్స్  చేసిన వివరాలు ఇవ్వాలని ఎల్డీఎం అయ్యప్ప రెడ్డిని ఆదేశించారు. అడిషనల్  ఎస్పీ రవి, ఎక్సైజ్  సూపరింటెండెంట్  సైదులు పాల్గొన్నారు.