- కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, వెలుగు: సమాజ నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల పాత్ర అత్యంత కీలకమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గాదిగూడ మండలంలోని లోకారి (కె)లో కొత్తగా నిర్మించిన మండల ప్రాథమిక పాఠశాల భవనాన్ని సోమవారం ఎంపీ గొడం నగేశ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ప్రారంభించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం అన్ని వసతులతో కూడిన స్కూళ్లను నిర్మిస్తోందని తెలిపారు. డీఈవో మాధవి, సర్పంచ్ మండవి పుష్పలత జాకు, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి పాల్గొన్నారు. ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతపై దిశానిర్దేశం చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 'బ్లాక్ స్పాట్స్'ను గుర్తించి, వెంటనే నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, రేడియం లైట్లు, బ్లింకర్లను ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పటిష్టం చేయాలని స్పష్టం చేశారు. అడిషనల్ కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్ఎస్ చిత్రు, ఉట్నూర్ ఆర్డీవో మోహన్ సింగ్ తదితరులు ఉన్నారు.
