ఆదిలాబాద్‌లో అనాథ పిల్లల సంరక్షకులకు ఇందిరమ్మ ఇండ్లు : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్‌లో అనాథ పిల్లల సంరక్షకులకు ఇందిరమ్మ ఇండ్లు :  కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: వసతి లేని అనాథ పిల్లల సంరక్షకులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆదిలాబాద్ ​కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో అనాథ పిల్లలతో సమావేశమయ్యారు. వారి విద్య, ఆరోగ్యం, సమస్యలపై చర్చించారు. పిల్లలకు ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసి, వారితో కలిసి భోజనం చేశారు. 

 జిల్లాలోని 202 మంది అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ, 8 మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు అందించామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ సలోని, డీడబ్ల్యూఓ మిల్కా, డీసీపీవో రాజేంద్రప్రసాద్, ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.