స్కూళ్లలో పెండింగ్​ పనులు వెంటనే పూర్తి చేయాలి : కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​

స్కూళ్లలో పెండింగ్​ పనులు వెంటనే పూర్తి చేయాలి : కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: అమ్మ ఆదర్శ పాఠశాల  కింద జిల్లాలోని గవర్నమెంట్​ స్కూళ్లలో   చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ ఆదేశించారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ మండలం రాఘవాపూర్​ యూపీఎస్​ స్కూల్​ను కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

స్కూల్​లో అభివృద్ధి పనులు, క్లాస్​ రూమ్స్​, టాయిలెట్స్​,కిటికీలు, తలుపుల  రిపేర్​ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పనులు వేగవంతం చేసి సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. ఆయనతోపాటు ఎడ్యుకేషన్​ మండల నోడల్​ ఆఫీసర్​ కొమురయ్య, హెచ్​ఎం హన్మంతరావు, టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.