రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆఫీసర్లను ఆదేశించారు. రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక రవాణాపై జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంగళవారం రివ్యూ సమావేశం నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పురోగతిపై మండలాల వారీగా ఆరా తీశారు. ప్రభుత్వం ఇండ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక అందిస్తోందని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

జీపీ సెక్రటరీ, మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు తమ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఉచిత ఇసుక సరఫరా అయ్యేలా తహసీల్దార్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాలో ఇసుక, మొరం మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దృష్టిపెట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, కలెక్టరేట్ ఏవో రామ్ చందర్, తహసీల్దార్లు  పాల్గొన్నారు.

చీర్లవంచలోని విద్యాలయాల్లో తనిఖీ

వేములవాడ, వెలుగు: ప్రతి విద్యార్థి చదవడం రాయడంపై టీచర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామంలోని ప్రైమరీ, హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పరిశీలించారు. మౌలిక సౌకర్యాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు.