- కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు : మొదటి విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, ఎన్నికల సాధారణ పరిశీలకుడు గంగాధర్ తో కలిసి మొదటి విడత పోలింగ్ సిబ్బందికి నిర్వహించిన మూడో ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 11న ఉదయం 7 గంటలకు మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరుగనుందన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని వెల్లడించాలని చెప్పారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్లు, రిటర్నింగ్, జోనల్ ఆఫీసర్లు, మైక్రో అబ్జర్వార్లు, ఇతర సిబ్బంది సహకరించాలన్నారు.
కొన్ని గ్రీన్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. 4 మండలాల్లో 40 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు వివరించారు. బుధవారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి పోలింగ్ కు అవసరమైన మెటీరియల్ ప్రిసైడింగ్ఆఫీసర్లకు అందజేసి గ్రామ పంచాయతీలకు పంపించాలన్నారు. గద్వాల ధరూర్ గట్టు కేటి దొడ్డి మండలాల్లో మొత్తం 974 పోలింగ్ స్టేషన్లు ర్యాండమైజేషన్ లో భాగమమైనట్లు తెలిపారు.

