మహబూబ్నగర్ రూరల్, వెలుగు : పాలమూరు యూనివర్సిటీ వేదికగా ఈనెల 17,18 న జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ కన్వెన్షన్ జయప్రదం చేయాలని యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు రాజేశ్, రాము పిలుపునిచ్చారు. సోమవారం పీయూలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల నుంచి 200 మంది డెలిగేట్స్ హాజరవుతారని , రాష్ట్రంలోని యూనివర్సిటీల సమస్యలపై చర్చించి, భవిష్యత్తు ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు.
అన్ని యూనివర్సిటీలో రీసెర్చ్ ఫెలోషిప్లు అందించాలని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించాలని, యూనివర్సిటీలో రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించాలని, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ఎత్తివేయాలని, ఇతర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
