- కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు : భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్ లో పెట్టొద్దని కలెక్టర్ సంతోష్ రెవెన్యూ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో రెవెన్యూ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల ద్వారా 6391 దరఖాస్తులు వచ్చాయన్నారు.
వచ్చిన దరఖాస్తులు పరిశీలించి రూల్స్ ప్రకారం పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై దృష్టి పెట్టాలని చెప్పారు. క్యాస్ట్, ఇన్కం, రెసిడెంట్ ధ్రువీకరణ పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో అలివేలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
