ఎలక్షన్ ​రూల్స్​ పకడ్బందీగా అమలు చేస్తున్నాం.. ఇప్పటివరకూ రూ.1.61 కోట్లు సీజ్​ 

ఎలక్షన్ ​రూల్స్​ పకడ్బందీగా అమలు చేస్తున్నాం.. ఇప్పటివరకూ రూ.1.61 కోట్లు సీజ్​ 
  • 2,403 లీటర్ల మద్యం పట్టివేత 

సంగారెడ్డి, వెలుగు : జిల్లాలో ఎలక్షన్​రూల్స్​ పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్​ శరత్​ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్పీ రూపేశ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల  ప్రవర్తన నియమావళిపై పొలిటికల్​ పార్టీలతో పాటు ఓటర్లలో చైతన్యం తీసుకొస్తున్నామన్నారు. ముగ్గురు ఫ్లయింగ్​ స్క్వాడ్​లతో పోలింగ్​ స్టేషన్లు,  సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లు, సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించామన్నారు. బార్డర్​ ప్రాంతాల్లో 9 చెక్​ పోస్టులు, ఇంటర్నల్​గా 5 చెక్​ పోస్టులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా రూ.1,61,74,480లను  సీజ్​ చేయగా మరో 14 .80 లక్షలను ఇన్‌కాంటాక్స్​స్వాధీనం చేసుకున్నామన్నారు. 

1,819 మంది బైండోవర్​

జిల్లాలో ఇప్పటివరకు 1,819మందిని బైండోవర్​ చేసినట్టు ఎస్పీ రూపేశ్ తెలిపారు. రూ. కోటి 61 లక్షల పైబడి నగదు సీజ్ చేయగా 2,403 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకునీ 187 కేసులు నమోదు చేశామన్నారు. మరో 1,000 మందిని బైండోవర్​ కేసులు గుర్తించి దశల వారిగా కౌన్సెలింగ్​ ఇప్పిస్తున్నామన్నారు. పక్క రాష్ట్రాల పోలీస్​ యాంత్రాంగాలతో సమావేశమై శాంతి, భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సోషల్​ మీడియాలో వచ్చే ఫేక్​ న్యూస్​లపై నిఘా పెట్టి జీసీఎస్​ ట్రాకింగ్​ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.  సమావేశంలో అడిషనల్​ కలెక్టర్లు చంద్రశేఖర్​, మాధురి, డీఆర్​ఓ మెంచు నగేశ్​ పాల్గొన్నారు.