వర్ధన్నపేట, వెలుగు: తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారి ప్రవర్తనలో మార్పులను గమనించి సరైన మార్గదర్శనం చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న చైల్డ్ సేఫ్టీ ప్రొటెక్షన్ సే నో టు డ్రగ్స్ వీక్ కార్యక్రమంలో విద్యార్థులతో ప్రమాణం చేయించడంతో పాటు సే నో టు డ్రగ్స్ సందేశంతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, డీఎంహెచ్వో సాంబాశివరావు తదితరులు పాల్గొన్నారు.

