హనుమకొండ జిల్లాలో వడ్ల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

హనుమకొండ జిల్లాలో వడ్ల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

హనుమకొండసిటీ, వెలుగు: హనుమకొండ జిల్లాలో వానాకాలం సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్నేహ శబరీశ్​ కోరారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్ లో పౌరసరఫరాలు, డీఆర్డీఏ, వ్యవసాయ శాఖల అధికారులతో ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. 

కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, వెయింగ్ మిషన్లు, మాయిశ్చర్ మిషన్లు, టెంట్, వాటర్ తదితర ఏర్పాట్లు అక్టోబర్ 5 నాటికి సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, సివిల్ సప్లయిస్ అధికారి మహేందర్, డీఆర్డీవో మేన శ్రీను, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.