పోలింగ్‌‌‌‌కు సహకరించాలి : ఇలా త్రిపాఠి

పోలింగ్‌‌‌‌కు సహకరించాలి : ఇలా త్రిపాఠి

ములుగు, వెలుగు :  ఎన్నికలు సజావుగా జరిగేందుకు క్యాండిడేట్లు, లీడర్లు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌‌‌‌ ఇలా త్రిపాఠి చెప్పారు. జనరల్‌‌‌‌ అబ్జర్వర్‌‌‌‌ సవిన్‌‌‌‌ బన్సల్, పోలీస్‌‌‌‌ అబ్జర్వర్‌‌‌‌ అంజన్‌‌‌‌ చక్రబోర్తి, వ్యయ పరిశీలకులు వాగీశ్‌‌‌‌కుమార్‌‌‌‌ సింగ్‌‌‌‌, ఎస్పీ గౌస్‌‌‌‌ ఆలం, రిటర్నింగ్ ఆఫీసర్‌‌‌‌ అంకిత్‌‌‌‌తో కలిసి పోటీలో ఉన్న క్యాండిడేట్ల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్‌‌‌‌లో మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌ మాట్లాడుతూ క్యాండిడేట్ల ఎన్నికల ఖర్చును తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పారు.

నవంబర్‌‌‌‌ 21 నుంచి 23 వరకు అబ్జర్వర్లు జిల్లాలో పర్యటించి క్యాండిడేట్ల వివరాలను పరిశీలిస్తారని ప్రకటించారు. కౌంటింగ్‌‌‌‌ ముగిసిన తర్వాత కూడా క్యాండిడేట్ల ఖర్చును పరిశీలించనున్నట్లు చెప్పారు. ములుగు నియోజకవర్గ పరిధిలోని 303 పోలింగ్‌‌‌‌ కేంద్రాలకు సంబంధించిన ఏజెంట్ల వివరాలను త్వరగా అందించాలని సూచించారు. పోలింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌లోకి మైక్రో అబ్జర్వర్లు, ప్రిసైడింగ్‌‌‌‌ ఆఫీసర్లు మాత్రమే సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ తీసుకురావొచ్చని, మిగతా వారికి పర్మిషన్‌‌‌‌ లేదన్నారు.

పోలింగ్ ఏజెంట్లు ఉదయం 5 గంటలకే సెంటర్లకు చేరుకోవాలని, ఆరు గంటలకు మాక్‌‌‌‌ పోలింగ్‌‌‌‌ ఉంటుందన్నారు. కౌంటింగ్‌‌‌‌ కోసం సైతం టేబుల్‌‌‌‌కు ఒక ఏజెంట్‌‌‌‌ చొప్పున డిసెంబర్‌‌‌‌ 1 వరకు వివరాలు అందించాలని, కౌంటింగ్‌‌‌‌ ఏజెంట్ల ఖర్చును సైతం క్యాండిడేట్ల ఎన్నికల ఖర్చులోనే నమోదు చేస్తామన్నారు. ఎన్నికల కోడ్‌‌‌‌ ఉల్లఘించినా, విద్వేష ప్రసంగాలు చేసినా, డబ్బు, మద్యం రవాణాచేసినా సి విజిల్‌‌‌‌ యాప్‌‌‌‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్‌‌‌‌ విజయభాస్కర్, ఎలక్షన్‌‌‌‌ సెల్‌‌‌‌ సిబ్బంది పాల్గొన్నారు. 

ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

వరంగల్​సిటీ, వెలుగు : ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వరంగల్‌‌‌‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌‌‌‌ ప్రావీణ్య చెప్పారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్‌‌‌‌ తూర్పులో క్యాండిడేట్ల పేర్లు ఫైనల్‌‌‌‌ అయినందున, వారికి గుర్తులు కూడా కేటాయించినట్లు చెప్పారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వెబ్‌‌‌‌ కాస్టింగ్‌‌‌‌, అధిక భద్రతా సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 24 వరకు ఓటర్‌‌‌‌ స్లిప్‌‌‌‌లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. డిప్యూటీ డీఈవో, ఆర్డీవో వాసు చంద్ర, ఆఫీసర్లు ఆయుబ్‌‌‌‌ అలీ, విశ్వన్నారాయణ పాల్గొన్నారు. 

ఎపిక్‌‌‌‌ కార్డులను ఓటరుకే ఇవ్వాలి

మహబూబాబాద్, వెలుగు : ఓటరు గుర్తింపు కార్డులను సంబంధిత ఓటరుకు మాత్రమే అందజేయాలని మహబూబాబాద్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ శశాంక ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌లో మాట్లాడుతూ జిల్లాలో 54 వేల ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టినందు, అవి పోస్టల్‌‌‌‌ ద్వారా ఓటర్లకు చేరేలా చూడాలన్నారు. వారం రోజుల్లో డెలివరీ కాని కార్డులను కలెక్టరేట్‌‌‌‌లో అందజేయాలని చెప్పారు.