మహబూబాబాద్/ కాశీబుగ్గ/ నర్సంపేట/ జనగామ అర్బన్, వెలుగు: ప్రజావాణి పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖల ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో వారు ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. మహబూబాబాద్ కలెక్టరేట్లో వివిధ సమస్యలపై 156 వినతులు వచ్చాయని కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. వరంగల్ కలెక్టరేట్లో 136 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ సత్యశారద చెప్పారు.
నర్సంపేట టౌన్‌లోని ప్రభుత్వ, గ్నీన్ ల్యాండ్ స్థలాల్లో వెలసిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని సీపీఎం టౌన్ సెక్రటరీ, 10వ వార్డు కౌన్సిలర్ హనుమకొండ శ్రీధర్ వరంగల్ కలెక్టర్‌కు సీపీఎం నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 224 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ఆయా వినతులను సంబంధిత ఆఫీసర్లకు అందజేసి వెంటనే పరిష్కరించాలని సూచించారు.
