కాలేజీ బస్సు అదుపు తప్పి రెండు కార్లు ధ్వంసం

కాలేజీ బస్సు అదుపు తప్పి రెండు కార్లు ధ్వంసం

జీడిమెట్ల, వెలుగు: ఓ కాలేజీ బస్సు బీభత్సం సృష్టించింది. బుధవారం జగద్గిరిగుట్ట పైప్​లైన్​ రోడ్డులో వెళ్తున్న సీఎంఆర్​ కాలేజీకి చెందిన బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. డ్రైవర్​ బస్సును కంట్రోల్​ చేయలేక వెనుక నుంచి ఓ కారును ఢీకొట్టాడు. ఆ కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఓ పాపతో పాటు ఇద్దరు మహిళలకు గాయాలు కావడంతో వారిని దవాఖానకు తరలించారు.