మెడికల్ పీజీ సీట్లు బ్లాక్ కానివ్వం

మెడికల్ పీజీ సీట్లు బ్లాక్ కానివ్వం

హైదరాబాద్, వెలుగు:  మెడికల్ పీజీ సీట్లకు ఇంకో రౌండ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ కరుణాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వెల్లడించారు. ఒకవేళ ఆ రౌండ్ తర్వాత కూడా సీట్లు మిగిలితే, మరో రౌండ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల స్టూడెంట్లు ఉద్దేశపూర్వకంగా బ్లాక్​ చేసినవి, వివిధ కారణాలతో కొందరు స్టూడెంట్లు వదిలేసిన 58 సీట్లను నోటిఫై చేసి పెట్టామని, వీటిలో ఒక్క సీటూ బ్లాక్ కానివ్వబోమన్నారు. డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి కరుణాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మెడికల్ పీజీ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా సీట్లకు రిజర్వేషన్లు ఉండవని, ఏ రాష్ట్రానికి చెందిన స్టూడెంటైనా నీట్ ర్యాంకు ఆధారంగా సీట్లను పొందొచ్చన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్లు కూడా ఇక్కడ కౌన్సిలింగ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే చాన్స్ ఉన్నందున.. సీటు బ్లాకింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌‌‌‌‌‌‌‌ నుంచే ఇతర రాష్ట్రాలకు చెందిన అనుమానిత స్టూడెంట్లకు లెటర్లు రాస్తున్నామని, సీటు బ్లాకింగ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నామని చెప్పారు. సెకండ్ ఫేజ్‌‌‌‌‌‌‌‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన 14 మంది మెరిట్ స్టూడెంట్లకు ఇక్కడ సీట్లు వస్తే, అందులో నలుగురు జాయిన్ అవకుండా వెళ్లిపోయారని చెప్పారు. ఆ తర్వాత రౌండ్‌‌‌‌‌‌‌‌లో మరో 20 మందికి సీట్లు అలాట్ అవగా, అందులో 16 మంది జాయిన్ కాలేదన్నారు. లెటర్లు రాస్తే, అందులో ఐదుగురి నుంచి రిప్లై వచ్చిందన్నారు. అప్లై చేయకుండానే సీట్లు వచ్చాయని వాళ్లు చెప్పారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.  

వాళ్లకూ చాన్స్ ఇస్తాం

మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అడ్వైజరీకి విరుద్ధంగా మన స్టూడెంట్లు కొంత మంది ఆల్‌‌‌‌‌‌‌‌ఇండియా మాప్‌‌‌‌‌‌‌‌అప్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారని వీసీ అన్నారు. సెకండ్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌లో మన స్టేట్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన సీట్లను వదిలేసి, ఆల్‌‌‌‌‌‌‌‌ఇండియా మాప్‌‌‌‌‌‌‌‌అప్ రౌండ్‌‌‌‌‌‌‌‌ కోసం వెళ్లారన్నారు. సుప్రీంకోర్టు ఆల్‌‌‌‌‌‌‌‌ఇండియా మాప్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయడం వల్ల, వీళ్లకు సెకండ్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన సీట్లను వెనక్కి ఇవ్వాలని ఎంసీసీ సూచించిందన్నారు. అయితే, వీళ్లు వదిలేసిన సీట్లను స్టేట్‌‌‌‌‌‌‌‌ మాప్‌‌‌‌‌‌‌‌అప్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌లో వేరే స్టూడెంట్లకు ఇచ్చేశామని, ఇప్పుడు వారిని తప్పించి వీళ్లకు సీట్లు ఇవ్వడం కుదరదన్నారు. ఇతర రాష్ట్రాల్లో చేసినట్టుగా మన స్టేట్‌‌‌‌‌‌‌‌లో మాప్‌‌‌‌‌‌‌‌అప్ రౌండ్ క్యాన్సిల్ చేయాలన్న స్టూడెంట్ల డిమాండ్ సరికాదని, అలా చేస్తే ఆరొందలకు పైగా స్టూడెంట్లు డిస్టర్బ్‌‌‌‌‌‌‌‌ అవుతారని, కొంత మంది కోసం ఇంత మందిని ఇబ్బంది పెట్టలేమన్నారు. సీట్లు వదిలేసి వెళ్లిన స్టూడెంట్లకు ఇప్పుడు నిర్వహించబోయే కౌన్సిలింగ్‌‌‌‌‌‌‌‌లో చాన్స్​ ఇస్తామన్నారు. సీటును వదిలేస్తే, తదుపరి రౌండ్ కౌన్సిలింగ్‌‌‌‌‌‌‌‌లో అవకాశం ఉండదని, ప్రభుత్వ అనుమతితో వీళ్లకు పర్మిషన్ ఇస్తామన్నారు. 

వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ ఉండాలె

సీటు బ్లాకింగ్ దందాను అరికట్టాలంటే ఆల్‌‌‌‌‌‌‌‌ఇండియా లెవల్‌‌‌‌‌‌‌‌లో ఒక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ ఉండాలని, అందులో అన్ని రాష్ట్రాల కౌన్సిలింగ్ వివరాలను అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాలని వీసీ చెప్పారు. ఇలా చేయడం వల్ల ఏయే స్టూడెంట్‌‌‌‌‌‌‌‌కు ఎక్కడ సీటు వచ్చిందో తెలుసుకోవచ్చన్నారు. దీంతో ఆల్రెడీ వేరే రాష్ట్రంలో సీటు వచ్చిన స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ మన దగ్గర కౌన్సిలింగ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంటే ఈజీగా గుర్తించవచ్చునన్నారు. ఇలా చేయాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ కోరామని, సీటు బ్లాకింగ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడుతున్న స్టూడెంట్ల వివరాలను కూడా ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీకి అందజేశామని వీసీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా సీటు బ్లాకింగ్ దందా జరుగుతోందని డీఎంఈ రమేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఈ దందాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటోందని, ఇలా మరే రాష్ట్రమూ చేయడం లేదని చెప్పారు.

కోర్టునూ మోసం చేసిన్రు 
కౌన్సిలింగ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ర్టేషన్‌‌‌‌‌‌‌‌ తేదీ ముగిసిన తర్వాత, కొంత మంది స్టూడెంట్లు కోర్టుకు వెళ్లి రకరకాల కారణాల వల్ల తాము రిజిస్ర్టేషన్‌‌‌‌‌‌‌‌ చేసుకోలేకపోయామని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటారు. 

ఇలా ఆర్డర్ తెచ్చుకున్నవాళ్లు  రిజిస్ర్టేషన్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడానికి యూనివర్సిటీ పర్మిషన్ ఇస్తుంది. ఇలా ఈసారి ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు స్టూడెంట్ల పేరిట కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని వీసీ తెలిపారు. ఆ ముగ్గురిని వర్సిటీ స్టాఫ్ సంప్రదిస్తే అందులో ఇద్దరు అసలు తాము కోర్టుకే వెళ్లలేదని చెప్పారన్నారు. దీంతో వాళ్ల పేర్ల మీద కోర్టుకు ఎవరు వెళ్లారన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సూచనతో ఆ ఇద్దరి వివరాలను పోలీసులకు అందజేశామని తెలిపారు. అయితే, సీటు బ్లాకింగ్ దందాలో ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాల పాత్ర ఉందా? అని రిపోర్టర్లు ప్రశ్నించగా, ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. కాలేజీల పేర్లు వెల్లడించడానికి కూడా వీసీ, డీఎంఈ ఇష్టపడలేదు. బ్లాకింగ్ వ్యవహారంపై గవర్నర్ రిపోర్ట్ అడిగారని, రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ అందజేస్తామని చెప్పారు.