
ముషీరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ పరిధి అనుబంధ కాలేజీలకు సంబంధించి రెండ్రోజుల పాటు జరిగే ‘ఇంటర్ కాలేజెస్ కబడ్డీ టోర్నమెంట్23– 2024’ పోటీలు శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీలో ఉత్సాహంగా మొదలయ్యాయి. కబడ్డీ మాజీ క్రీడాకారుడు మహేందర్ రెడ్డి, ఓయూ ప్రొఫెసర్లు కె. డిఫ్లా, ఆర్. రాజేశ్, సత్యనారాయణ, సునీల్ కుమార్ హాజరై ఈ పోటీలను ప్రారంభించారు.
కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల మేనేజ్ మెంట్ చదువుతో పాటు ఆటలను ప్రోత్సహించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఓయూ అనుబంధంగా ఉన్న 48 కాలేజీలు ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేశాయి. కార్యక్రమంలో టోర్నమెంట్ సెక్రటరీ కె. కృష్ణ, శ్రవణ్, అంబేద్కర్ కాలేజీ డైరెక్టర్లు, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.