ఘనాపై ఘన విజయం.. ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లోకి కొలంబియా

ఘనాపై ఘన విజయం.. ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లోకి కొలంబియా

కాన్సాస్‌‌‌‌ సిటీ: స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ జాన్‌‌‌‌ కార్డోబా గాయంతో మ్యాచ్‌‌‌‌కు దూరమైనా.. కొలంబియా ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ప్రిక్వార్టర్స్‌‌‌‌లోకి ప్రవేశించింది. రౌండ్‌‌‌‌–32 మ్యాచ్‌‌‌‌లో 1–0తో ఘనాపై గెలిచింది. సబ్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ లూయిస్‌‌‌‌ సువారెజ్‌‌‌‌ అద్భుతమైన పాస్‌‌‌‌లతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో 14వ నిమిషంలో అతను అందించిన పాస్‌‌‌‌ను జాన్‌‌‌‌ అరియాస్‌‌‌‌ నేర్పుగా గోల్ పోస్ట్‌‌‌‌లోకి పంపాడు. 

మ్యాచ్‌‌‌‌ ఆరంభం నుంచే బంతిని ఎక్కువసేపు ఆధిక్యంలో కొలంబియా వరుస దాడులతో ఘనాపై ఒత్తిడి పెంచింది. మ్యాచ్‌‌‌‌ 56వ  నిమిషంలో లూయిస్ డయాజ్‌‌‌‌ కొట్టిన గోల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ సైడ్‌‌‌‌ వెళ్లింది. ఘనా గోల్‌‌‌‌ కీపర్‌‌‌‌ ఏడు గోల్స్‌‌‌‌ కాపాడినా ప్రయోజనం దక్కలేదు. ఇదే క్రమంలో ఘనా చేసిన ప్రతిదాడిని కొలంబియా డిఫెండర్లు సమర్థంగా తిప్పికొట్టారు. ఎనిమిది ప్రయత్నాల్లో ఒక్కటి కూడా ఫలించలేదు.