మాకు ఓటు హక్కు లేదా.. ఎందుకు డబ్బులు ఇవ్వరు..

మాకు ఓటు హక్కు లేదా.. ఎందుకు డబ్బులు ఇవ్వరు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో ఓటర్లు ఆందోనకు దిగారు. బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఇంటి ముందు కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. హమాలీ కాలనీకి చెందిన ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. 

తమకు డబ్బులు ఇవ్వకపోవడంతో వనమాను ఓటర్లు నిలదీశారు. మాకు ఓటు హక్కు లేదా.. అందరికీ ఇచ్చినట్లు మాకు ఎందుకు డబ్బులు ఇవ్వలేరని ప్రశ్నించారు. ఇస్తే అందరికీ సమానంగా డబ్బులు ఇవ్వాలని లేదంటే.. ఎవ్వరికి ఇవ్వకుండా ఉండాలని ఆరోపించారు. లేదంటే.. మాకు ఓటు అడకుండా ఉండాలి.. అలాంటప్పుడు ఓట్లు ఎందుకు అడగడానికి వస్తారని మండిపడ్డారు. దీంతో అక్కడి పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.