లాటరీలో కోట్ల రూపాయిలు వస్తే.. పుచ్చకాయ కొన్నాడు

లాటరీలో కోట్ల రూపాయిలు వస్తే.. పుచ్చకాయ కొన్నాడు

అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. కొంత మంది మట్టిని పట్టుకున్నా బంగారం అవుతుంది. మరికొంత మంది బంగారాన్ని పట్టుకున్నా మట్టి అవుతుంది. తాజాగా అమెరికాలో ఓ వ్యక్తిని అదృష్టం ఓ రేంజిలో పట్టుకుంది.అమెరికాలో నివసిస్తున్న ఓ వృద్ధుడి విషయంలోనూ అదే జరిగింది, అతనికి  42 కోట్ల  రూపాయిల విలువైన లాటరీ వచ్చింది. అయితే ఆ వ్యక్తి ఆ లాటరీ డబ్బుతో మొదటగా పుచ్చకాయ కొన్నాడు.. ఆ తరువాత తన భార్యకు పూల బొకె కొన్నాడు.  

  కొలరాడోలో నివసిస్తున్న 77 ఏళ్ల వ్యక్తి బంపర్ లాటరీని గెలుచుకున్నాడు. దీంతో అతడి ఇంట్లో ధనలక్ష్మి నాట్యం చేసింది. ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు అయిపోయాడు. . ఎవరికైనా డబ్బులు వస్తున్నాయని తెలిస్తే ముందుగానే వాటితో ఏం చేయాలో ప్రణాళిక వేస్తారు.  ఎందులో పెట్టుబడి పెట్టాలి.  ఆ సొమ్మును ఏ అవసరాలకు వినియోగించుకోవాలని అని ప్లాన్ వేసుకుంటారు.  

కొలరాడోలోని మాంట్రోస్‌లో నివసించే ఓ వృద్ధుడికి లాటరీలో కోట్ల విలువైన జాక్‌పాట్‌ వచ్చింది.  అతను  తన పెంపుడు కుక్కతో జాకింగ్ వెళ్లాడు .  ఇంటికి తిరిగి రాగానే 5 లక్షల 67 వేల 041 డాలర్లు అంటే  భారతీయ కరెన్సీ ప్రకారం 42 కోట్ల  రూపాయిలను లాటరీలో గెలిచి కోటీశ్వరుడయ్యాడని తెలుసుకున్నాడు.  మొదట ఈ వార్త నిజం కాదనుకున్నాడు.  అయితే తర్వాత అతను బహుమతిని గెలుచుకున్నాడని తెలియడంతో అతను మొత్తం సొమ్మును ఒకేసారి తీసుకొన్నాడు.  పన్నులు మినహాయించగా అతనికి 21 కోట్ల 2 లక్షల  రూపాయిలు బహుమతిగా వచ్చాయి.

ఆ వృద్దుడు ఫ్రైజ్ 21 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందుకున్న తర్వాత పండ్ల దుకాణానికి వెళ్లి పుచ్చకాయను  కొనుగోలు చేశాడు.  అంతే కాదు అతని భార్య కోసం పూల బొకేను కూడా కొన్నాడు.  మిగతా డబ్బుతో తన భార్యకు అనారోగ్యం ఉందని కొన్ని సర్జరీలు అవసరమని తెలిపాడు.  తన ఆరోగ్యం తప్ప ఆయనకు వేరే ఇతర పెద్ద ప్రణాళిక ఏమీ లేదని చెప్పాడు.  మొత్తంగా అమెరికాలో లాటరీల ద్వారా చాలా మంది రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కొందరు టైంపాస్ కోసం టికెట్లు కొన్న వారికి సైతం అదృష్టం కలిసి రాగా.. మరికొంత మంది ఎన్నో సార్లు లాటరీ టికెట్లు కొనుగోలు చేసి లక్కీ అనేది అందని ద్రాక్షలాగే మిగిలిపోతుంది.