ఓపక్క విడాకుల న్యూస్.. ఇంతలో బుర్ఖాలో ప్రత్యక్షం.. వైరలవుతున్న స్వాతి వీడియో

ఓపక్క విడాకుల న్యూస్.. ఇంతలో బుర్ఖాలో ప్రత్యక్షం.. వైరలవుతున్న స్వాతి వీడియో

కలర్స్ స్వాతి(Colours Swathi) విడాకుల న్యూస్ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. గత కొంత కాలంగా స్వాతి తన భర్తతో దూరంగా ఉంటోందని, ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధాలే విడాకులకు దారి తీశాయని వార్తలు బలంగా వినిపించాయి. కానీ ఈ వార్తలపై ఇటు స్వాతి గానీ, తన భర్త కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 
  
ఇలా విడాకుల వార్తలు వైరల్ అవుతున్న వేళా అనుకోని విధంగా రైల్వే స్టేషన్ లో ప్రత్యక్షమైంది స్వాతి. అందులోను బుర్ఖా ధరించి. ఆ లుక్ లో స్వాతిని చూసిన చాలా మంది అసలు స్వాతి బుర్ఖా ఎందుకు వేసుకుంది అనే విషయం తెలుసుకోవడానికి ట్రై చేశారు. అంతేకాదు.. విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి కదా అందుకే ఎవరు గుర్తుపట్టకుండా ఎలా చేసిందేమో అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే తాజాగా దీనికి సంబందించిన వీడియో విడుదలైంది. ఆ వీడియోలో స్వాతి  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బుర్ఖాలో అటు ఇటు తిరుగుతూ సందడిగా కనిపించింది. అది కేవలం ఫన్ కోసమే చేసినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది.