
సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్
అమనగల్లు, వెలుగు: పరమ గురువుల శరీరాన్ని వదిలినప్పటికీ ఆత్మ చైతన్యంతో విశ్వమంతటా వ్యాపించి ఉంటారని సీబీఐ మాజీ డైరెక్టర్ డాక్టర్కార్తికేయన్ చెప్పారు. పత్రీజీ ధ్యానం నేర్చుకుని 40 ఏండ్లు ప్రపంచమంతటా తిరిగి పేదవారి నుంచి సంపన్నుల దాకా ధ్యానాన్ని తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కడ్తాల్ మహేశ్వర మహాపిరమిడ్‌లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగంలో శుక్రవారం కార్తికేయన్పాల్గొని పత్రీజీకి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పత్రీజీ ఎంతో ముందు చూపు కలిగిన వ్యక్తి అని, ఆత్మ జ్ఞాన గ్రంథాలను అధ్యయనం చేసి మనకు పంచారని చెప్పారు. ఆయన కృషితో ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతోందన్నారు. కార్యక్రమంలో పత్రీజీ సతీమణి స్వర్ణమాల, కూతురు పరిమిళ, పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్విజయ భాస్కర్‌రెడ్డి, ట్రస్ట్ సభ్యులు, పెద్ద ఎత్తున ధ్యానులు పాల్గొన్నారు.
ఓయూలో ఉత్సాహంగా 2కే రన్
వచ్చే నెల 3,4 తేదీల్లో ఓయూలో జరగనున్న గ్లోబల్ అలుమ్నీ మీట్–2023 నేపథ్యంలో శుక్రవారం ఉస్మానియా వర్సిటీలో ఫ్యాకల్టీ, స్టూడెంట్లు 2కే రన్ నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ జెండా ఊపి ఈ రన్‌ను ప్రారంభించగా.. ఎన్సీసీ గేట్ వరకు కొనసాగింది. అనంతరం ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. వర్సిటీలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ గ్లోబల్అలుమ్నీ మీట్‌ను సక్సెస్ చేయాలని.. లెక్చరర్లు, స్టూడెంట్లు సహకరించాలని కోరారు. - వెలుగు, ఓయూ
బైక్ షోరూం ఓనర్ కిడ్నాప్‌కు యత్నం
డ్రైవర్‌తో పాటు మరొకరి అరెస్ట్
పరారీలో మరో ఇద్దరు యువకులు
గండిపేట, వెలుగు: బైక్ షోరూం యజమానిని అతని కారు డ్రైవరు, మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట గ్రీన్ విల్లాలో ఉండే సాయి కిరణ్ కుమార్‌రెడ్డి(28) బహదూర్‌పురాలో ఓ ప్రముఖ కంపెనీ బైక్ షోరూంను నిర్వహిస్తున్నాడు. ఇతని వద్ద నాగర్‌కర్నూల్‌కు చెందిన పెండ్యాల సుదర్శన్(32) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సుదర్శన్ ఇప్పటికే రాయదుర్గం, మహంకాళి, గజ్వేల్ పీఎస్‌ల పరిధిలో వెహికల్స్చోరీ చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. జైలులో ఉన్న టైంలో బాలాపూర్ క్రాస్‌రోడ్ ప్రాంతానికి ఆలేటి అర్జున్(23) పరిచయం అయ్యాడు.
అయితే సాయికిరణ్కుమార్డైలీ లక్షల్లో డబ్బు డిపాజిట్ చేయడం గమనించిన సుదర్శన్.. ఓనర్‌ను కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయాలని స్కెచ్ వేశాడు. అర్జున్‌తో పాటు విజయ్, అనిల్ అనే మరో ఇద్దరితో కలిసి వారం రోజులు రెక్కీ నిర్వహించారు. ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సుదర్శన్ తన ఓనర్‌ను గండిపేట నుంచి కారులో షోరూంకు తీసుకొస్తుండగా రాజేంద్రనగర్ పరిధి పత్తికుంట వద్ద అర్జున్, విజయ్, అనిల్ మకాం వేశారు. పత్తికుంట వద్ద టాయిలెట్‌కు వెళ్లివస్తానని కారు ఆపగా అర్జున్, విజయ్, అనిల్ సాయికిరణ్‌ను అదిమి పట్టుకున్నారు. కొద్దిసేపు పెనుగులాడి కారు నుంచి దూకేశాడు. స్థానికులు చూస్తుండడంతో నలుగురు యువకులు అదే కారులో పరారయ్యారు. బాధితుడు రాజేంద్రనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు శుక్రవారం సుదర్శన్, అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు. కారు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. విజయ్, అనిల్ పరారీలో ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు.
ఉత్తమ పోలీసులకు సత్కారం
ఈ ఏడాది ఉత్తమ సేవలు అందించిన పోలీసులను సిటీ సీపీ ఆనంద్ సత్కరించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ, 12 మంది ఇన్ స్పెక్టర్లు, 23 మంది ఎస్సైలు, 75 మంది కానిస్టేబుల్స్, ఒక హోంగార్డులు ఉన్నారు. వీరికి సర్టిఫికేట్‌తో పాటు క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. - వెలుగు, ఖైరతాబాద్
ఏపీకి చెందిన 26 కులాలను తెలంగాణ బీసీ జాబితాలో చేర్చొద్దు
ముషీరాబాద్, వెలుగు: ఏపీకి చెందిన 26 కులాలను తెలంగాణ బీసీ జాబితాలో చేర్చొద్దని బీసీ– ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మానస గణేశ్ ప్రభుత్వాన్ని కోరారు. బీసీ–ఎ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం బీసీ సాధికారత భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన ఈ 26 కులాలను తిరిగి తెలంగాణ బీసీ జాబితాలో చేర్చాలనుకోవడం అన్యాయమన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏపీకి చెందిన ఈ 26 కులాలను తెలంగాణ బీసీ జాబితా నుంచి తొలగించిందన్నారు.
ఈ తొలగింపును అప్పటి ఉమ్మడి హైకోర్టు సమర్దించిందని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రా ప్రాంత కులాలను చేర్చే ప్రయత్నం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరహరి, ట్రెజరర్ అబ్బు లింగం, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆలకుంట శేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సాంబమూర్తి, ఉపాధ్యక్షుడు మోహన్ చౌహన్, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు రాంచందర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
షిర్డికి వెళ్తున్నట్లు చెప్పి.. వైజాగ్‌లో ఇన్ స్టాగ్రామ్ పోస్ట్
సిటీకి చెందిన యువకుడి మిస్సింగ్
కంటోన్మెంట్, వెలుగు: యువకుడి మిస్సింగ్ ఘటన బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. చిత్తారెడ్డి కాలనీలో ఉండే ప్రశాంత్(26) ఎర్రగడ్డలోని బజాజ్ షోరూంలో సేల్స్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. వారం రోజుల కిందట షిర్డికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరిన ప్రశాంత్ ఇప్పటివరకు తిరిగిరాలేదు. ప్రశాంత్ వైజాగ్‌లో ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు అతడికి కాల్ చేశారు. మొబైల్ స్విచాఫ్ రావడంతో శుక్రవారం బోయిన్పల్లి పోలీసులకు కంప్ల
యింట్ చేశారు. మిస్సింగ్ కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇంటికెళ్లే దారి గుర్తు లేక తప్పిపోయిన వృద్ధురాలు
వాట్సప్ గ్రూప్ సాయంతో 4 గంటల్లో ఆమెను ఇంటికి చేర్చిన పోలీసులు
ఉప్పల్, వెలుగు: మనవడి కోసం సొంతూరి నుంచి సిటీకి వచ్చిన ఓ వృద్ధురాలు అతడి ఇంటికి వెళ్లే దారి గుర్తు లేక తప్పిపోయింది. పోలీసులు 4 గంటల వ్యవధిలోనే ఆమెను ఇంటికి చేర్చారు. ఈ ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో జరిగింది. కరీంనగర్‌కు చెందిన రాజమ్మ(80) సిటీలోని రామాంతాపూర్ పరిధి శ్రీనగర్ కాలనీలో ఉండే తన మనవడు శ్రీనివాస్ ఇంటికి రెండ్రోజుల కిందట వచ్చింది. శుక్రవారం ఉదయం10 గంటలకు అనుకోకుండా బయటికి వచ్చిన రాజమ్మ మనవడి ఇల్లు ఎక్కడుందో మర్చిపోయింది. ఎటు వెళ్లాలో తెలియక కాలనీల్లో తిరుగుతూ.. ‘తాను కరీంనగర్ నుంచి వచ్చానని.. తన మనవడి పేరు శ్రీనివాస్’ అని దారిన పోయే వారిని అడుగుతూ వెళ్లింది. వృద్ధురాలి పరిస్థితిని గమనించిన కొందరు కాలనీ వాసులు శ్రీనివాస్ ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెంటనే డయల్100కు కాల్ చేశారు.
ఉప్పల్ పెట్రోలింగ్ ఇన్ చార్జి నర్సింగ్ రావు రామాంతాపూర్‌కు చేరుకున్నారు. రాజమ్మ ఫొటోను, శ్రీనివాస్ వివరాలను కేసీఆర్ నగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, సంక్షేమ సంఘం కాలనీలకు చెందిన వాట్సాప్ గ్రూప్ లో పోస్టు చేశారు. ఇది ఆ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో కొందరు శ్రీనివాస్ ఇంటి అడ్రస్‌ను గుర్తించి పోలీసులకు పంపారు. దీంతో పోలీసులు రాజమ్మను మధ్యాహ్నం 2 గంటలకు మనవడి ఇంటికి చేర్చారు. అప్పటికే కనిపించకుండా పోయిన రాజమ్మ కోసం కుటుంబసభ్యులు వెతుకుతుండగా.. ఈలోగా ఆమెను పోలీసులు ఇంటికి తీసుకెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నారు.
న్యూ ఇయర్ వేడుకల్లోడ్రగ్స్ను అడ్డుకోవాలి
ఖైరతాబాద్, వెలుగు: డ్రగ్స్‌తో యువత భవిష్యత్ నాశనం అవుతోందని.. న్యూ ఇయర్ వేడుకల్లో వాటిని వాడొద్దని కాంగ్రెస్ ఖైరతాబాద్ సెగ్మెంట్ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోతె రోహిత్ ఆధ్వర్యంలో శుక్రవారం బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు దగ్గర ప్రదర్శన చేపట్టారు. అనంతరం రోహిన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని ఆరోపించారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ ను అడ్డుకోవాలన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బైండ్ల శ్రీనివాస్, ఖైరతాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బల్లు రాథోడ్ పాల్గొన్నారు.
గిరిజన బంధు ఇవ్వాలి
గిరిజన విద్యార్థి నాయకుల డిమాండ్
ప్రగతిభవన్ ముట్టడికి యత్నం.. అరెస్ట్
ఖైరతాబాద్, వెలుగు: గిరిజన బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్థి సంఘం, నంగార భేరి లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రగతి భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్, నంగార భేరి లంబాడీ హక్కుల పోరాట సమితి స్టేట్ ప్రెసిడెంట్ గణేష్ రాథోడ్ మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహారాజ్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 15ను సెలవు దినంగా ప్రకటించాలన్నారు. కొత్తగా నిర్మిస్తున్న సెక్రటేరియట్లో సేవాలాల్ మహారాజ్, మేరామాయడి జ్ఞాన మందిరాన్ని నిర్మించాలన్నారు. తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించి ఏటా రూ. 5 కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. ప్రభుత్వం ఎస్టీల భూములను అన్యాయంగా లాక్కుంటోందని, భూమి లేని వారికి మూడెకరాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన వీరిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి గోషా మహల్ స్టేడియానికి తరలించారు.
పార్కు స్థలంలో దివ్యాంగుల సంక్షేమ భవన్ వద్దు
మంత్రి సబితకు మర్రి లక్ష్మమ్మ కాలనీ వాసుల వినతిఎల్బీనగర్,వెలుగు: కాలనీ పార్కులో దివ్యాంగుల సంక్షేమ భవన్ నిర్మాణాన్ని నిలిపివేయాలని బడంగ్ పేట మున్సిపల్ పరిధి నాదర్గుల్లోని మర్రి లక్ష్మమ్మ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కాలనీవాసులు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆమె చాంబర్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. కాలనీలో పిల్లలు ఆడుకునేందుకు కేటాయించిన పార్కు స్థలంలో దివ్యాంగుల సంక్షేమ భవనం నిర్మిస్తున్నట్లు ఒక శిలాఫలకం ఏర్పాటు చేశారన్నారు. పార్కు స్థలాన్ని ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని వారు చెప్పారు. దివ్యాంగుల సంక్షేమ భవన్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరగా.. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.భాస్కర్, జనరల్ సెక్రటరీ కుమారస్వామి, హరికిషన్, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
1987 టెన్త్ బ్యాచ్ ఒక్క చోట..
నల్గొండలోని సెయింట్ ఆల్ఫోన్సస్ అండ్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 1987లో టెన్త్ క్లాస్ పూర్తి చేసిన 113 మంది పూర్వ విద్యార్థులు హైదరాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో కలుసుకున్నారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ దేశాల్లో సెటిలైన వారు కూడా ఈ రీయూనియన్‌లో పాల్గొనడం విశేషం. రెండు రోజుల పాటు జరిగిన వేడుకల్లో చిన్నపిల్లల్లా ఆటపాటలతో ఎంజాయ్చేశారు. స్కూల్‌డేస్‌ను గుర్తు చేసుకున్నారు. వివిధ కారణాలతో చనిపోయిన తోటి మిత్రులకు సంతాపం తెలిపారు. మూడేండ్లుగా ఎవరెవరు ఎక్కడడెక్కడ ఉన్నారో తెలుసుకుని జూమ్ మీటింగ్స్, వాట్సాప్ ద్వారా ఒక్కచోటికి చేరామని వారు తెలిపారు. 113 మందిలో 34 మంది మహిళలు ఉన్నారు. - వెలుగు, హైదరాబాద్
లెర్నింగ్ మెటీరియల్‌తో టీచింగ్ సులభతరం
క్లస్టర్ ఇన్చార్జి పరమేశ్వరమ్మ
ఖైరతాబాద్, వెలుగు: ప్రాథమిక స్థాయిలోనే స్కూల్ స్టూడెంట్లకు పలు అంశాలను ఆసక్తికగా, సులభంగా చెప్పేందుకు టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ ఎంతో అవసరమని క్లస్టర్ ఇన్చార్జి పరమేశ్వరమ్మ అన్నారు. రెండ్రోజుల బోధనోపకరణ మేళా శుక్రవారం అమీర్‌పేటలోని ప్రభుత్వ స్కూల్లో ప్రారంభమైంది. ఈ మేళాలో ఖైరతాబాద్ మండల ప్రభుత్వ స్కూల్‌కు చెందిన 50 మంది టీచర్లు, వారి బోధనాంశాలకు చెందిన నమూనాలు, వర్కింగ్ మోడల్స్ ను తయారు చేసి ప్రదర్శించారు. ఈ
సందర్భంగా క్లస్టర్ ఇన్చార్జి పరమేశ్వరమ్మ మాట్లాడుతూ.. టీచర్లు తరచూ ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ బోధన పద్ధతులను మెరుగుపరచుకోవడంతో పాటు విషయాన్ని స్టూడెంట్లకు అర్ధవంతంగా, ఆసక్తిగా చెప్పొచ్చన్నారు.
దీనివల్ల స్టూడెంట్ల స్కూల్ డ్రాప్ ఔట్స్ కు చెక్ పెట్టొచ్చన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి స్టూడెంట్లకు భాషపై అవగాహన పెంచి.. వారు మ్యాథ్స్, సైన్స్‌లో పట్టు సాధించే విధంగా టీచర్లకు బోధనోపకరణ సామగ్రి ఉపయోగపడుతుందన్నారు. ఈ మేళాలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఐదు నమూనాలను జిల్లా స్థాయి ఈ మేళాకు ఎంపిక చేస్తూ పాల్గొన్న టీచర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ నరసింహ, యూసుఫ్ గూడ ప్రభుత్వ స్కూల్ హెడ్ మాస్టర్ పుష్పలత, జవహర్ నగర్ ప్రభుత్వ స్కూల్ టీచర్లు పాల్గొన్నారు.
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అన్యాయం చేయొద్దు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు
ఓయూ, వెలుగు: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీసీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ఓయూ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఓయూ లైబ్రరీలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. హైకోర్డు ఆదేశాల ప్రకారం ఎస్సై, కానిస్టేబుల్అభ్యర్థులకు మార్కులు కలపాలన్నారు. పాత పద్ధతిలోనే ఈవెంట్స్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ ఉద్దేశపూర్వకంగానే అభ్యర్థులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫలితంగా నిరుద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్న అభ్యర్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. క్వశ్చన్ పేపర్లో తప్పులు దొర్లడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్, ఏఐవైఎఫ్ కార్యదర్శి ధర్మేంద్ర, డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జావేద్ పాల్గొన్నారు.
బీసీ జనాభా లెక్క తేలాలి
ఎల్ బీనగర్: బీసీ జనాభా లెక్కింపు జరిగే వరకు ఐక్యంగా ఉద్యమించాలని కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. శుక్రవారం నాగోల్‌లోని ఎస్ఏ డాంగే భవన్‌లో జరిగిన బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర సమావేశానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
సిటీ వ్యాప్తంగా అయ్యప్పల ఆందోళన
బైరి నరేశ్‌ను శిక్షించాలంటూ డిమాండ్
హైదరాబాద్/మెహిదీపట్నం/ పద్మారావునగర్/గండిపేట/శంషాబాద్/వికారాబాద్, వెలుగు: అయ్యప్ప స్వామిపై బైరి నరేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో శుక్రవారం గ్రేటర్ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ సీపీ ఆఫీసు ముందు అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులు ఆందోళన చేశారు. బైరి నరేశ్‌ను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ జంక్షన్‌లో నరేశ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం హిందూ సంఘాలు, నటి కరాటే కల్యాణి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద అయ్యప్ప స్వాముల సామూహిక హారతికి పిలుపునిచ్చారు. నరేశ్‌ను అరెస్ట్ చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లంగర్ హౌస్, గోల్కొండ, అసిఫ్ నగర్, టప్పాచబుత్రలో అయ్యప్ప స్వాములు, గాంధీనగర్ పీఎస్‌లో బీజేవైఎం నాయకులు బైరి నరేశ్‌పై కంప్లయింట్ చేశారు. గురుస్వామి ఉపేందర్ మొగుళ్లపల్లి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు సరూర్‌నగర్ పీఎస్‌లో రాజేంద్రనగర్, నార్సింగి పోలీస్ స్టేషన్లలోనూ కంప్లయింట్ చేశారు. శంషాబాద్ అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో శంషాబాద్ బస్టాండ్ నుంచి అయ్యప్ప స్వాములు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏసీపీ భాస్కర్ కు వినతిపత్రం అందజేశారు.
కొడంగల్ పీఎస్‌లో కేసు నమోదు
వికారాబాద్: బైరి నరేశ్‌పై కోడంగల్ పీఎస్‌లో వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. అతడికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చూస్తామన్నారు. ఎక్సైజ్ ఎస్సై పోస్టుకు హైట్ తగ్గించాలి: ఎస్ఎఫ్ఐఓయూ, వెలుగు: టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసిన గ్రూప్–-2 నోటిఫికేషన్లో ఎక్సైజ్సబ్ఇన్స్పెక్టర్ పోస్టుకు నిర్ణయించిన హైట్‌ను తగ్గించాలని ఎస్ఎఫ్ఐ లీడర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్‌కాలేజీ ముందు ఎస్ఎఫ్ఐ 53వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఓయూ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రవినాయక్ మాట్లాడుతూ.. ఫెడరేషన్ఆధ్వర్యంలో 53 మూడేండ్లుగా స్టూడెంట్ల సమస్యలపై పోరాడుతున్నట్లు గుర్తుచేశారు. గతంలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా అర్హత సాధించాలంటే హైట్165 సెంటీమీటర్లు ఉండేదని, తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో167.6కు పెంచడం దారుణమన్నారు. దీంతో అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని వాపోయారు. కార్యక్రమంలో ఓయూ ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు సాయికిరణ్, నాయకులు ఆనంద్ శర్మ, పవన్ కల్యాణ్, రమ్య, పునీత్, సమీర్, నాగేశ్వరి, స్నేహిత, నవనీత తదితరులు పాల్గొన్నారు.