ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వెలుగు నెట్ వర్క్: కొత్త ఏడాదిలో ఉద్యోగులు మరింత కష్టపడి పనిచేయాలని హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. ఆదివారం జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, అడిషనల్  కలెక్టర్‌ సంధ్యా రాణి, డీఆర్వో వాసు చంద్ర, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ కుమార్, జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్​ను కలిసి న్యూఇయర్ విషెస్ చెప్పారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ కొత్త క్యాలెండర్​ను, డైరీని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలపై ఉద్యోగులు మరింత దృష్టి పెట్టాలన్నారు. అధికారులు కష్టపడి పనిచేసి  జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకు శాయశక్తులా కృషి చేయాలన్నారు. పరకాల ఆర్డీవో రాము, తహసీల్దార్ గనిపాక రాజ్ కుమార్, టీజీవో అధ్యక్షుడు జగన్మోహన్ రావు, టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్, మెప్మా పీడీ భద్రు నాయక్ తదితరులు ఉన్నారు.

  • జనగామ జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంచాలని కలెక్టర్ శివలింగయ్య ఆఫీసర్లను కోరారు. ఆదివారం ఉద్యోగులంతా కలెక్టర్ కు న్యూఇయర్ విషెస్ చెప్పారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వివిధ సంక్షే మ పథకాల అమలులో మరింత ప్రతిభ కనబర్చాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​ప్రపుల్ దేశాయ్, డీఆర్డీవో పీడీ రాంరెడ్డి, సీపీవో ఇస్మాయిల్, డీఎంహెచ్​వో మహేందర్​, ఎస్సీ కార్పొరేషన్​ ఈడీ వెంకన్న, డీసీఎస్​వో రోజారాణి తదితరులున్నారు.
  •   వరంగల్ బల్దియా కార్పొరేటర్లు ఆదివారం మేయర్ గుండు సుధారాణిని కలిశారు. బొకేలు ఇచ్చి న్యూఇయర్ విషెస్ చెప్పారు. అనంతరం కమిషనర్ ప్రావీణ్యతో కలిసి కేక్ కట్ చేశారు.
  •   ఈ కొత్త ఏడాదిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని మహబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీసులకు సూచించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. డీఎస్పీలు సదయ్య, రఘు, సీఐలు, ఎస్ఐలు ఉన్నారు.
  •   ములుగు జిల్లాకేంద్రంలోని పోలీసు ఆఫీసులో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఆదివారం సిబ్బందితో కలిసి న్యూఇయర్ వేడుకలు జరుపుకొన్నారు. ఓఎస్ డీ గౌస్ ఆలం,  ఏఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్ కుమార్, సీఐలు, ఎస్సైలంతా ఎస్పీకి బొకేలు అందజేసి న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా, ములుగు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే సీతక్క పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు.

గ్రాండ్​గా ఎంపీ బర్త్​డే వేడుకలు

  బాలికలకు సైకిళ్లు పంపిణీ చేసిన ఎంపీ

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ ఎంపీ, బీఆర్ఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మాలోత్ కవిత బర్త్ డేను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై ఎంపీకి విషెస్ చెప్పారు. డాన్సులతో హోరెత్తించారు. ఎంపీకి గజమాల వేసి అభిమానం చాటుకున్నారు. ఇదిలా ఉండగా.. తన పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ కవిత కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబసభ్యులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. ప్రభుత్వ బడులకు చెందిన 21మంది బాలికలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. శబరిమలకు వెళ్లే 21మంది అయ్యప్ప స్వాములకు ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో డోర్నకల్​ఎమ్మెల్యే రెడ్యానాయక్​, డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్​నవీన్​రావు, బీఆర్ఎస్ లీడర్లు పర్కాల శ్రీనివాస్​రెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి, ముత్యం వెంకన్న, నాళ్ల వీరన్న, కొండ్లె సూరయ్య, రాజేశ్, మహబూబ్ పాషా, యుగేందర్, శ్రీహరి, శ్రీనివాస్ తదితరులున్నారు.

బీఆర్ఎస్ కు ఓటమి తప్పదు

మొగుళ్లపల్లి, వెలుగు: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ కు ఓటమి తప్పదని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ చార్జి గండ్ర సత్యనారాయణరావు విమర్శించారు. ఆదివారం మొగుళ్లపల్లి మండలకేంద్రంలో కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యలను కేసీఆర్ గాలికొదిలి, దేశాన్ని ఏలుతానని పోవడం విడ్డూరంగా ఉందన్నారు. రెండు దఫాలుగా ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కుమారస్వామి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బండి సుదర్శన్ గౌడ్, పోలినేని లింగారావు, టౌన్ ప్రెసిడెంట్ రమేశ్, నడిగొటి రాము, తక్కల్లపల్లి రాజు తదితరులున్నారు.

ప్రజలకు నమ్మకం కల్పించాలి': వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్

హనుమకొండ, వెలుగు: పోలీస్ స్టేషన్​కు వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని వరంగల్ సీపీ ఏవీ. రంగనాథ్ సిబ్బందికి సూచించారు. న్యూఇయర్ సందర్భంగా ఆదివారం కమిషనరేట్ ఆఫీసులో వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు గోపి, రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ అధికారులు, ఇతర పోలీస్ సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేశారు. కలెక్టర్లు, పోలీసులతో పాటు ఉద్యోగ సంఘాలు, ఎన్జీవోలు, చైల్డ్ లైన్, మల్లికాంబ మనోవికాస కేంద్రం చిన్నారులు వివిధ సంఘాల ప్రతినిధులు సీపీకి న్యూఇయర్ విషెస్ చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ రంగనాథ్ మాట్లాడారు. ఈ ఏడాది పోలీసులకు ఎంతో కీలకమన్నారు. సాధారణ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసేందుకు సమాయత్తం కావాలన్నారు. కార్యక్రమంలో డీసీపీలు అశోక్ కుమార్, వెంకటలక్ష్మీ, సీతారాం, అడిషనల్ డీసీపీలు వైభవ్ గైక్వాడ్, పుష్పారెడ్డి, సంజీవ్, సురేశ్​తదితరులున్నారు.

ఐలోని మల్లన్నకు వెండి ఆభరణాల బహూకరణ

ఐనవోలు, వెలుగు: ప్రముఖ పుణ్య క్షేత్రం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయానికి పర్ష సర్వేశ్వర్​– కౌసల్య దంపతులు వెండి ఆభరణాలను బహూకరించారు. మల్లికార్జున స్వామి గర్భగుడి ముఖద్వారానికి, దర్జాజకు సుమారు 40 కిలోల వెండితో తొడుగు చేయించారు. ఆదివారం ఈవో అద్దంకి నాగేశ్వరరావు, ఆలయ అర్చకులకు చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. గుడిలోని గణపతి విగ్రహానికి ఒక కిలో వెండితో కిరీటం, హస్తాలు, తొండం చేయించి అందజేశారు. అంతేగాక ఆలయ ఆవరణలోని ఎల్లమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి సాయం అందించేందుకు కూడా ముందుకువచ్చారు. ఈ కార్యక్రమంలో దాత పర్ష సర్వేశ్వర్​ కూతురు జి.వనజ, అల్లుడు పవన్​ రాజ్​, తదితరులు పాల్గొన్నారు.

ట్రెక్కింగ్ వైపు సిటీ యూత్

వరంగల్ సిటీ యూత్ ట్రెక్కింగ్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా ఉంటుందనే ఉద్దేశంతో దీనివైపు మొగ్గు చూపుతున్నారు. వరంగల్ లోని పద్మాక్షిగుట్ట సమీపంలోని అగ్గిలయ్య గుట్ట వద్ద ట్రెక్కింగ్ ఏర్పాటు చేయగా, యువత తరలివచ్చి, సేఫ్టీ పాటిస్తూ  కొండలు ఎక్కుతున్నారు. ఇది లైఫ్ లో ఒక మెమోరీగా ఉంటుందని చెబుతున్నారు. - వరంగల్ ఫొటోగ్రాఫర్, వెలుగు