
కాలానికి తగ్గట్టు డ్రెస్‌లు వేసుకుంటేనే కంఫర్ట్‌గా ఉంటుంది..అందంగా కనిపిస్తుంది. మరి అలా వానాకాలానికి ఎలాంటి బట్టలు నప్పుతాయంటే..కాషాయం, పసుపు, గులాబి, నీలం లాంటి డార్క్ కలర్ డ్రెస్‌లు వేసుకోవాలి. జీన్స్, సల్వార్స్, పటియాలా వంటి డ్రెస్‌లు పొడవుగా కాళ్ల చివర్ల వరకూ ఉంటాయి. ఇలాంటివి వేసుకోకపోవడమే బెటర్. కావాలంటే యాంకిల్ లెంగ్త్ జీన్స్ వేసుకోవచ్చు. డెనిమ్, సిల్క్, ఉన్ని క్లాత్‌లు తడిస్తే ఆరడానికి ఎక్కువ టైం పడుతుంది. పైగా తడికి త్వరగా పాడవుతాయి కూడా. అందుకే ఈ కాలం వాటికి దూరంగా ఉండాలి. తడిసినా త్వరగా ఆరిపోయే షిఫాన్, పాలిస్టర్, సింథటిక్ ఫ్యాబ్రిక్స్ ఎంచుకుంటే మంచిది. ఒంటికి అతుక్కుపోయేలా ఉండే బట్టలు ఎంత తక్కువగా వేసుకుంటే అంత మంచిది. ఫ్లోరల్ డ్రెస్‌లు అందంగా ఉంటాయి. వీటి మీద బురద పడినా కనిపించదు. కాటన్ బట్టలకు దూరంగా ఉండాలి.