కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో స్కై వాక్ బ్రిడ్జి ఆవిష్కరణ

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో స్కై వాక్ బ్రిడ్జి ఆవిష్కరణ

రాష్ట్ర పోలీస్ డిపార్టుమెంట్ తలమానికం లాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేస్తామన్నారు.

నిర్మాణంలో ఉన్న ఈ భవన సముదాయంలో… రెండు అత్యంత ఎత్తైన టవర్లను ను కలిపే స్కై వాక్ బ్రిడ్జ్ ను ఇవాళ డీజీపీ ఆవిష్కరించారు.  దేశంలోనే ఇది అత్యంత ఎత్తైన బరువైన స్కైవాక్. దీని పొడవు 2వందల అడుగులు. బరువు 425 మెట్రిక్ టన్నులు.

ఈ కార్యక్రమానికి డీజీపీ తో పాటు… హోమ్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణతో పాటు మరికొందరు అధికారులు హాజరయ్యారు.

ఈ భవన నిర్మాణం తొందర్లోనే పూర్తయి.. అతి త్వరలోనే ప్రారంభం అవుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. ఈ భవనంలో ఉపయోగిస్తున్న సాంకేతిక విధానం… అద్భుతాలు సృష్టిస్తుందని ఆర్ అండ్ బి శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. ఒక్క పోలీస్ డిపార్టుమెంట్ మాత్రమే కాదు.. అన్ని ప్రభుత్వ శాఖలను టెక్నాలజీ సాయంతో కనెక్ట్ చేస్తున్నామని చెప్పారు.