ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో సభ్యుల కామెంట్లు

ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో సభ్యుల కామెంట్లు

దళిత జాతులకు న్యాయం చేసే తీర్పు : కడియం శ్రీహరి

1994 జూలైలో ప్రారంభమైన ఈ ఉద్యమం 2024 జూలైలో సుప్రీంకోర్టు ద్వారా చారిత్రత్మకమైన తీర్పును వెలువరించి.. దళిత జాతులకు సమ న్యాయం చేసే చక్కటి అవకాశం కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడగానే వర్గీకరణకు సంఘీభావం తెలుపుతూ అఫిడవిట్ వేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణ అనుకూలంగా అఫిడిట్ ఇచ్చింది.

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: హరీశ్

ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. వర్గీకరణ మీద తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి.. కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అసెంబ్లీ తీర్మానం కాపీని ప్రధానమంత్రిని స్వయంగా కలిసి ఇచ్చారు.

గత ప్రభుత్వం మాదిగలను పట్టించుకోలేదు : మందుల శామ్యూల్

సుదీర్ఘ పోరాటం తరువాత ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నం. మాదిగల ఏబీసీడీ వర్గీకరణ జరగాలని లక్షలాది మాదిగలు కోరుకున్నరు. అన్నదమ్ములా కలిసి ఉంటం.. తమ వాటా తాము తీసుకుంటం. గత ప్రభుత్వం మాదిగలను ఎక్కడా పట్టించుకోలేదు.

కేటీఆర్.. హరీశ్​రావు మాదిగలు చెబితే వినాల అని వాకౌట్ చేశారు: కవ్వంపల్లి సత్యనారాయణ  

మాదిగలు మాట్లాడితే మేం వినాలా అనే విధంగా దొరలు కేటీఆర్, హరీశ్​రావు వాకౌట్ చేశారు. వారు మాదిగలను ముందు నుంచే అవమానపర్చారు. అఖిలపక్షం వేయమన్నందుకు మందకృష్ణ మాదిగను చంచల్​గూడ జైలుకు పంపారు.