ఎల్పీజీ సిలిండర్ ధరలను తగ్గిస్తూ అయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాయి. దీంతో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 99.75 తగ్గింది. తగ్గిన ధరలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఓఎంసీలు ప్రకటించాయి. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రం సంస్థలు తగ్గించలేదు.
తాజా మార్పులతో ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,680కి చేరింది.
ప్రతీ నెల 1వ తేదీన సిలిండర్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు సవరిస్తుంటాయి. కాగా వాణిజ్య సిలిండర్ ధరలు గత కొన్ని నెలలుగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ డొమెస్టిక్ సిలిండర్ ధరలు మాత్రం తగ్గడం లేదు.