
టానిక్ లిక్కర్ మార్ట్ లపై తనిఖీలు కొనసాగుతున్నాయి. శేరిలింగంపల్లిలోని మియాపూర్, గచ్చిబౌలిలోని క్యూ లిక్కర్ మార్ట్ లో సోదాలు నిర్వహిస్తున్నారు అబ్కారీ శాఖ అధికారులు. ఖజాగూడ క్యూ లిక్కర్ మార్ట్ లో అసిస్టెంట్ కమిషనర్ ప్రణవి , మియాపూర్ లో జాయింట్ కమిషనర్ శాస్త్రి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
టానిక్ వైన్ షాపు నిర్వాహకులు వందలకోట్ల జీఎస్టీ ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. 2016లో ఎక్సైజ్శాఖ మంత్రి ఆదేశాలతో స్పెషల్ జీవో జారీ చేశారు. ఐ లైఫ్ పబ్, మరో మూడు పబ్బులకు స్పెషల్ జీవోల ద్వారా అనుమతిస్తూ జారీ చేసింది గత సర్కార్.
ALSO READ :- Nothing Phone 2a లాంచ్ అయింది..ధర, ఫీచర్లు మీకోసం..
దీంతో ఎక్సైజ్ శాఖ, కమర్షియల్ టాక్స్ అధికారుల తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పూర్తి దర్యాప్తు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీఆర్ఎస్ లో కీలక నేత అండదండలతోనే టానిక్ ఎలైట్ వైన్ షాపు నిర్వాకమని గుర్తించారు. టానిక్ వైన్ షాపు వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది జీఎస్టీ అధికారుల బృందం. డిపోల నుంచి తెచ్చినమద్యం లెక్కలను చూపించాలని టానిక్ ఎలైట్ ను కోరింది.