జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఘనంగా జాతిపిత జయంతి

జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఘనంగా జాతిపిత జయంతి

హైదరాబాద్ సిటీ, వెలుగు: జాతిపిత మహాత్మ గాంధీ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో కమిషనర్ ఆమ్రపాలి గాంధీ ఫొటోకు నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ సత్యం, అహింస, ప్రేమ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అడిషనల్ కమిషనర్ యాదగిరిరావు, జాయింట్ కమిషనర్ కులకర్ణి, చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు, ఓఎస్ డీ వేణుగోపాల్, ఏఎంసీలు రమణ, శారద పాల్గొన్నారు. తార్నాక డివిజన్ మాణినికేశ్వర్ నగర్ లోని గాంధీ విగ్రహానికి కాంగ్రెస్​నాయకులతో కలిసి డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి నివాళులర్పించారు. 

సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని  గాంధీ విగ్రహానికి కాంగ్రెస్​నియోజకవర్గ ఇన్​చార్జ్​డాక్టర్​ కోట నీలిమ, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​యాదవ్ నివాళులర్పించారు. గాంధీ ఆసుపత్రి వద్ద మహాత్ముడి విగ్రహానికి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజకుమారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్​శాస్ర్తి ఫొటోకు పూలమాలలు వేశారు. నెహ్రూ జూలాజికల్ పార్కులోని అడ్మినిస్ట్రేటివ్ భవనంలో క్యూరేటర్ సునీల్ ఎస్.హిరేమత్ గాంధీ ఫొటోకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిబ్బంది కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు చెందిన 350 మంది విద్యార్ధులకు డ్రాయింగ్ ,పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. 

గాంధీ జయంతి సందర్భంగా అడిక్​మెట్ గవర్నమెంట్​స్కూలులో సాయి కృష్ణ యాదవ్,శేషసాయి, జి జి చారిటీ హాస్పిటల్, పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్​క్యాంప్​నిర్వహించారు. ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ పాల్గొని నోట్​బుక్స్​పంపిణీ చేశారు. నిమ్స్ బ్లడ్ బ్యాంక్​ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ డా.మర్రి చెన్న రెడ్డి మానవ వనరుల అభివృద్ధి  కేంద్రంలో రక్తదానశిబిరం నిర్వహించారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, కేంద్రం  డైరెక్టర్ డా. మాధవి పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లలో కలెక్టర్లు, అధికారులు గాంధీ ఫొటోకు నివాళులర్పించారు.