నోటీసులకు స్పందించని డాక్టర్లు

నోటీసులకు స్పందించని డాక్టర్లు

తొలగింపుకు సిద్ధమవుతున్న వైద్య విధాన పరిషత్

హైదరాబాద్, వెలుగు: సర్కారు దవాఖాన్లలో పన్జేస్తున్న 90 మంది డాక్టర్లను తొలగించేందుకు వైద్య విధాన పరిషత్ సిద్ధమవుతోంది. దీర్ఘకాలికంగా విధులకు రాని 134 మంది డాక్టర్లకు ఇప్పటికే కమిషనర్‌‌‌‌ మాణిక్యరాజ్‌‌కు నోటీసులిచ్చారు. ఎందుకు గైర్హాజరవుతున్నారో చెప్పాలని కోరారు. వీటికి 40 మందే స్పందించినట్టు టీవీవీపీ వర్గాలు వెల్లడించాయి. ముగ్గురు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసినట్టు తెలిసింది. మిగిలిన 90 మందికి మరోసారి నోటీసులిచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పడూ స్పందించకుంటే ఉద్యోగాల నుంచి తొలగించనున్నారు. విధులకు వెళ్లని వారిలో 80 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో, సీహెచ్‌‌సీల్లో పన్జేస్తున్నవారే. 2018లోనే వీళ్లకు జాబ్స్ వచ్చాయి. ప్రయారిటీలు తీసుకోకుండా పోస్టింగులు ఇవ్వడం వల్లే ఎక్కువ మంది జాబ్ నుంచి డ్రాప్ అవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నోటీసులకు స్పందించిన 40 మంది కూడా గైర్హాజరికి ఇదే కారణాన్ని చూపినట్టు తెలిసింది.