
హైద్రాబాద్ లో విధులు నిర్వహిస్తున్న హైడ్రా మార్షల్స్ తమ జీతాల విషయంలో డిమాండ్లు చేసిన క్రమంలో కమిషనర్ రంగనాథ్ వారితో సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైడ్రాలో పనిచేసే ఎవరి జీతాలూ తగ్గించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. మార్షల్స్ జీతాలు పెంచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తగిన మేరకు త్వరలోనే పెంపు ఉండబోతుందని తెలిపారు.
మార్షల్స్ overtime అంశాన్ని పరిశీలించి, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రంగనాథ్ చెప్పారు. జీతాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం లో చొరవ చూపుతానని అన్నారు.
కమిషనర్ ఇచ్చిన హామీలో సంతృప్తి చెందిన హైడ్రామార్షల్స్ మూడు నెలల పాటు వేచి చూస్తామని ప్రకటించారు. జీతాల పెంపు జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.