మండు టెండలో సామాన్యుడి బతుకు పోరాటం

మండు టెండలో సామాన్యుడి బతుకు పోరాటం

భానుడి భగభగలకు నిలువెల్లా కాలిపోతున్నా.. పొట్టకూటి కోసం బతుకు బండి లాగక తప్పని పరిస్థితి ఆ సామాన్యుడిది. శనివారం హైదరాబాద్‌‌‌‌ వీధుల్లో ఎండ తీవ్రతను తట్టుకోలేక, తన సైకిల్​కు కర్రలు, పాత గుడ్డలతో ఒక చిన్న గూడును అమర్చుకుని ప్రయాణిస్తున్న ఈ దృశ్యం చూపరుల హృదయాలను కలచివేస్తోంది. 

రెక్కాడితే గానీ డొక్కాడని పేదరికం ఒకవైపు.. నిప్పులు కురిపిస్తున్న ఎండలు మరోవైపు.. ఈ రెండింటి మధ్య సాగుతున్న ఆ సామాన్యుడి పోరాటానికి, ఆవేదనకు ఈ చిత్రం అద్దం పడుతోంది.
హైదరాబాద్ సిటీ, వెలుగు