ముంబై: యుద్ధ విరమణ ఒప్పందానికి ఇరాన్, అమెరికా సిద్ధమవుతుండటంతో భారత స్టాక్ మార్కెట్లో ఐపీఓల హవా కనిపిస్తోంది. ఈక్విరస్ క్యాపిటల్ నివేదిక ప్రకారం 2026 లో ఇప్పటికే 23 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ. 27 వేల కోట్లకు పైగా నిధులను సమీకరించాయి. గత ఏడాది 2025 లో 103 కంపెనీలు రూ. 1.76 లక్షల కోట్లు సేకరించాయి.
టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ సొల్యూషన్స్, అద్విత్ జ్యువెల్స్, కార్డెలియా క్రూజెస్ ఆపరేటర్ వాటర్‌వేస్ లీజర్ టూరిజం లిమిటెడ్ ఈ నెలలోనే పబ్లిక్ ఇష్యూలను ప్రారంభించనున్నాయి. దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఈ వారంలోనే సెబీకి డాక్యుమెంట్లను అందించనుంది.
క్విక్ కామర్స్ యూనికార్న్ జెప్టో, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వచ్చే నెలలో ఐపీఓలు తీసుకురానున్నాయి. గత నెల నాటికి సెబీ దగ్గర 236 ఐపీఓ ప్రతిపాదనలు ఉన్నాయి.
