
హైదరాబాద్: మూసీ వరదలతో నష్టపోయిన తమకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా శంకర్ నగర్, మూసానగర్ బస్తీవాసులు. వరద వచ్చిన ప్రతి సారి కట్టుబట్టలతో బయటకు పోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ వరదలతో ఆస్తి నష్టం జరగలేదంటున్న ప్రభుత్వ వాదనలో నిజం లేదని వారు పేర్కొన్నారు.
మంత్రులు, అధికారులు తమ బస్తీలకు వచ్చి తమ కష్టాలు చూడాలని వారు కోరారు. ప్రభుత్వం స్పందించి వరద ముంపు ఉన్న బస్తీ వాసులకు సురక్షిత ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం లు కేటాయించాలన్నారు. గండీపేట్ జలాశయాన్ని కబ్జా చేసిన బడాబాబులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.