WTC Final : భారత్ నాలుగో టెస్టు గెలుస్తుందా..? ఫైనల్లో అడుగు పెడుతుందా..? 

WTC Final : భారత్ నాలుగో టెస్టు గెలుస్తుందా..? ఫైనల్లో అడుగు పెడుతుందా..? 

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా, శ్రీలంక పోటీ పడుతున్నాయి. ఇప్పటికే 60.20 పర్సంటేజ్ తో రెండో ప్లేస్ లో ఉన్న టీమిండియా ఆసీస్ తో జరిగే నాలుగో టెస్టులో గెలిస్తేనే నేరుగా ఫైనల్ చేరుతుంది. లేదంటే శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగే టెస్టు సిరీస్ ఫలితాలకోసం ఎదురుచూడాలి. ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్ సిరీస్ ని ఎలాగైనా గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకోవాలని చూస్తోంది. శ్రీలంక కూడా న్యూజిలాండ్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు సినేరియో ఎలా ఉందంటే...

టీమిండియా నాలుగో టెస్టులో ఆసీస్ పై విజయం సాధిస్తే నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధిస్తు్ంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ 60.29 పర్సంటేజ్ తో రెండో స్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానంలో శ్రీలంక 53.33 పర్సంటేజ్ తో ఉంది. అయితే, భారత్ నాలుగో టెస్టులో గెలిస్తే.. శ్రీలంక న్యూజిలాండ్ సిరీస్ లో గెలిచినా, ఓడినా ఫైనల్ కి చేరుతుంది.

ఒకవేళ టీమిండియా నాలుగో టెస్టును డ్రా చేసుకున్నా ఫైనల్ కు రీచ్ అవుతుంది. కాకపోతే  శ్రీలంక న్యూజిలాండ్ ను క్లీన్ స్వీప్ చేయకుండా ఉండాలి.

చివరి టెస్టులో టీమిండియా ఓడిపోతే.. న్యూజిలాండ్ శ్రీలంకపై రెండు మ్యాచుల్లో గెలవాలి. లేదంటే డ్రా అయినా చేసుకోవాలి.