ఒకే స్టూడెంట్ ​ర్యాంక్​ ఎన్నిట్లొస్తది?

ఒకే స్టూడెంట్ ​ర్యాంక్​ ఎన్నిట్లొస్తది?
  • జేఈఈ ర్యాంకులపై సీసీఎస్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: జేఈఈ అడ్వాన్స్​డ్ ర్యాంకుల ప్రకటనలపై టెక్నికల్‌‌‌‌‌‌‌‌ కాలేజెస్‌‌‌‌‌‌‌‌ ఎంప్లాయీస్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ గురువారం సీసీఎస్‌‌‌‌‌‌‌‌ పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఆయా విద్యా సంస్థలు ఫేక్ ర్యాంకులతో పేరెంట్స్‌‌‌‌‌‌‌‌ను మోసం చేస్తున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకే స్టూడెంట్ ర్యాంకును చైతన్య, నారాయణ, ఫిట్జీ, ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్‌‌‌‌‌‌‌‌ ఆకాష్‌‌‌‌‌‌‌‌ కాలేజ్‌‌‌‌‌‌‌‌ ప్రకటనలో వాడుకున్నాయన్నారు. మోసపూరిత ప్రకటనల్లో బ్రాండ్‌‌‌‌‌‌‌‌ అంబాసిడర్స్‌‌‌‌‌‌‌‌గా ఉన్న అల్లుఅర్జున్‌‌‌‌‌‌‌‌, రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ర్యాంకుల ఫొటోల్లో ఉన్న స్టూడెంట్ గురించి దర్యాప్తు చేయాలన్నారు.