ఆరోగ్య‌శాఖ మంత్రి లేక‌పోవ‌డంతోనే క‌రోనా మ‌ర‌ణాలు.. హెచ్ఆర్సీకి ఫిర్యాదు

ఆరోగ్య‌శాఖ మంత్రి లేక‌పోవ‌డంతోనే క‌రోనా మ‌ర‌ణాలు.. హెచ్ఆర్సీకి ఫిర్యాదు

హైదరాబాద్-రాష్ట్రంలో పూర్తి స్థాయి ఆరోగ్యశాఖ మంత్రి లేకపోవడం కారణంగా లోపాలు తలెత్తుతున్నాయన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్. ఇటీవ‌ల‌ కింగ్ కోఠి హాస్పిట‌ల్ లో ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘటనపై సోమ‌వారం యుగేందర్ గౌడ్  హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ ఘటనకు బాధ్యులుగా ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి, డీఎంహెచ్‌వో, హాస్పిటల్ సూపరింటెండెంట్, నోడల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరాన‌న్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ  హాస్పిట‌ల్స్ లో  మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో పాటు.. ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు. ఇటువంటి ఘటనలు రిపీట్ కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకుని, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని  కమిషన్ ను కోరానన్నారు యుగేందర్ గౌడ్.