I&PR కమిషనర్ అరవింద్‌పై జర్నలిస్ట్ సంఘాల ఫిర్యాదు

I&PR కమిషనర్ అరవింద్‌పై జర్నలిస్ట్ సంఘాల ఫిర్యాదు

కొన్ని మీడియా సంస్థలు, జర్నలిస్టులకు అన్యాయం చేసేలా రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నేతలు. కమిషనర్ తీరుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ సి.కే.ప్రసాద్ కు వినతిపత్రం ఇచ్చారు. వివిధ కేసుల విచారణలో భాగంగా హైదరాబాద్ వచ్చిన పీసీఐ చైర్మన్ ను హరితప్లాజాలో కలిసి సమస్యలను వివరించారు.

కొన్ని మీడియా సంస్థలను కమిషనర్ టార్గెట్ చేసి…ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు జర్నలిస్ట్ నాయకులు. రాష్ట్ర శాసనసభ, సెక్రటేరియట్ గుర్తింపు ఉన్న సంస్థలను కూడా బేఖాతర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడేషన్ నిబంధనల ప్రకారం ఎంప్యానెల్ మెంట్ లేకున్నా… 6 నెలలు పూర్తయిన మీడియా సంస్థలు… అక్రిడేషన్ కార్డులకు అర్హులైనా వారికి కార్డులు ఇవ్వడం లేదన్నారు. దీనిపై వెంటనే స్పందించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని…కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. పీసీఐ చైర్మన్ ను కలిసిన వారిలో IJU, TUWJ నేతలు ఉన్నారు.