
ఏపీ ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ నిధి అగర్వాల్ చక్కర్లు కొట్టారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటూ ఈ వీడియోను షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్ష వైసీపీ వర్గాలు. అంతే కాకుండా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు సంధిస్తోంది వైసీపీ. తన సినిమాలో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ కోసం పవన్ కళ్యాణ్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు వైసీపీ శ్రేణులు.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలపై స్పందించారు హీరోయిన్ నిధి అగర్వాల్. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదంటూ కొట్టిపడేసారు నిధి అగర్వాల్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ నోట్ రిలీజ్ చేశారు నిధి అగర్వాల్. తాను ఇటీవల ఓ స్టోర్ లాంచింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నానని.. అప్పుడు లోకల్ ఆర్గనైజర్లే తనకు ట్రాన్స్ పోర్టేషన్ ఏర్పాటు చేశారని అన్నారు నిధి అగర్వాల్.
అది ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన వెహికల్ అయ్యుండచ్చు కానీ.. ఆ వాహనాన్ని తనకు కేటాయించాలని తాను అడగలేదని స్పష్టం చేశారు నిధి అగర్వాల్. సదాసరు ఈవెంట్ ఆర్గనైజర్లే తనకు వాహనాన్ని కేటాయించారని.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ప్రభుత్వ అధికారులు తనకు వెహికల్ పంపలేదని అన్నారు.