టాలీవుడ్‌ను షేక్ చేయనున్న ‘ధురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్.. రామ్ చరణ్-నాని సినిమాలకు మ్యూజిక్!

టాలీవుడ్‌ను షేక్ చేయనున్న ‘ధురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్.. రామ్ చరణ్-నాని సినిమాలకు మ్యూజిక్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా, టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్’. 2023 మే 28న అధికారికంగా ప్రారంభమైన ఈ మూవీని రామ్ చరణ్‌తో పాటు విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

1905 బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో లవ్, రెవెల్యూషన్‌‌‌‌ ఎలిమెంట్స్‌‌‌‌తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ ‘శివ’ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియోకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

ఈ క్రమంలోనే చిత్రబృందం నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. బాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్‌దేవ్ని ఈ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు మేకర్స్. ఇటీవల ‘ధురంధర్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న శాశ్వత్, తన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా విలన్ ఎలివేషన్స్‌కు ఇచ్చిన బీజీఎం ట్రెండ్ అవుతూ భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

లేటెస్ట్ అప్డేట్ మేరకు, ది ఇండియా హౌస్ కోసం శాశ్వత్ సచ్‌దేవ్, ఇప్పటికే ఐదు సాంగ్స్ కంపోజ్ చేశారట. ట్యూన్స్ చాలా విభిన్నంగా, సినిమా థీమ్‌కు తగ్గట్టుగా ఉన్నాయని టాక్. ప్రస్తుతం ఈ సాంగ్స్ తెరకెక్కిస్తున్నట్లుగా టీమ్ వెల్లడించింది. ముఖ్యంగా శాశ్వత్ అందించిన మెలోడీ సాంగ్స్ అలాగే రఫ్ వర్షన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వేరే లెవల్ ఉన్నాయని తెలిపింది. 

శాశ్వత్ సచ్‌దేవ్ తెలుగు సినిమాలు:

శాశ్వత్ సచ్‌దేవ్ వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో హీరో నాని–సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకు కూడా శాశ్వత్ సంగీతం అందించనున్నాడనే వార్తలు ఆసక్తికరంగా మారాయి. దీనికి బలమైన కారణంగా, నాని తన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్‌లో శాశ్వత్ కంపోజ్ చేసిన ‘ధురంధర్’ ట్రాక్‌ను ఉపయోగించడమేనని సమాచారం.

మొదట ఈ సినిమాకు అనిరుధ్ పేరు వినిపించినప్పటికీ, కొత్తగా ట్రై చేయాలనే ఉద్దేశంతో నాని శాశ్వత్ సచ్‌దేవ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇకపోతే, ‘OG’ తర్వాత దర్శకుడు సుజీత్ తెరకెక్కించే సినిమా నానితోనే ఉండబోతోంది. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనున్నట్లు టాక్. స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరిలో ఈ మూవీ సెట్స్‌కు వెళ్లనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు కూడా సమాచారం.