బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్యథర్ కాంబోలో వచ్చిన రీసెంట్ మూవీ ‘ధురంధర్’. 2025 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన 'ధురంధర్'.. బాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలను తిరగరాసింది. ఆదిత్యధర్ అద్భుతమైన మేకింగ్, రణవీర్ సింగ్ ఎనర్జీ తోడవ్వడంతో ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా గ్రాస్, ఇండియాలోరూ.836 కోట్ల నెట్ వసూలు చేసి 2025లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలోనే "ధురంధర్" పార్ట్ 2 అనౌన్స్ మెంట్ వచ్చింది.
లేటెస్ట్గా ‘ధురంధర్’ పార్ట్ 2 (Dhurandhar: The Revenge) ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటుగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రణవీర్ సింగ్ వర్షంలో తడుస్తూ గంభీరమైన లుక్లో కనిపిస్తున్నాడు. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఎరుపు రంగుతో కప్పివేయగా, టైటిల్ Dhurandhar: The Revenge అని పోస్టర్ మీద చూపించారు.
చెడిపోవడానికి సమయం వచ్చింది
— Jio Studios (@jiostudios) February 3, 2026
Dhurandhar: The Revenge
Teaser Out Today at 12:12 PM#DhurandharTheRevenge Releasing In Cinemas Worldwide on 19th March 2026 in Hindi, Telugu, Tamil, Kannada & Malayalam.@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun… pic.twitter.com/Pxc1iN6VNd
ఇక టీజర్ విషయానికి వస్తే.. ‘ధురంధర్: ది రివెంజ్’సాలిడ్ ఇంపాక్ట్ తీసుకొచ్చింది. పార్ట్ 1ను మించేలా యాక్షన్, క్రైమ్ సీన్స్తో పవర్ ఫుల్గా ఉంది. ఈ లేటెస్ట్ టీజర్తో బాలీవుడ్తో పాటుగా టాలీవుడ్ ఆడియన్స్ కూడా థియేటర్లపై దండయాత్ర చేసేలా ఉన్నారు. యాక్షన్ సీక్వెన్సులు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. నిమిషం 12 సెకన్లు గల ఈ టీజర్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే నడిచింది. చివర్లో ‘ఇది నూతన భారతదేశం.. సరిహద్దులు దాటి చొరబడుతుంది.. దెబ్బ కొట్టి తీరుతుంది’ అనే ఒక్క డైలాగ్ తోనే ఇంటెన్స్ క్రియేట్ చేసింది.
ఇప్పటికే, తెలుగు ఆడియన్స్ ‘ధురంధర్’పార్ట్ 1ని ఓటీటీలో చూస్తూ ఇంప్రెస్ అయ్యారు. ఈ క్రమంలోనే పార్ట్ 2 తెలుగులో కూడా వస్తుండటంతో అతి భారీ అంచనాలు పెరిగాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 19న హిందీతో పాటుగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
అక్షయ్ ఖన్నా రిటర్న్ అవుతాడా?
రణ్ వీర్ సింగ్ పోస్ట్‌లో ‘ధురంధర్’ 2 కాస్ట్ ను ట్యాగ్ చేస్తూ అక్షయ్ ఖన్నా పేరును కూడా చేర్చడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అక్షయ్ ఖన్నా పార్ట్ 1లో విలన్ రెహమాన్ డకైట్ పాత్రలో కనిపించి, క్లైమాక్స్‌లో ఆ పాత్ర చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే, లేటెస్ట్ రణ్ వీర్ సింగ్ పోస్ట్‌లో అక్షయ్ ఖన్నా పేరును చేర్చడంతో, పార్ట్ 2లో ఆయన ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్ లో తిరిగి కనిపించనున్నారని తెలుస్తోంది.
