
కాంట్రవర్సియల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి పోలీసుల విచారణకు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యూహం సినిమా రిలీజ్ సమయంలో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోల మార్ఫింగ్ కి సంబంధించి గతంలో ఓసారి విచారణకు హాజరైన వర్మ మరోసారి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి మంగళావారం ( ఆగస్టు 12 ) ఒంగోలు రురల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు వర్మ.
ఇవాళ విచారణకు హాజరవ్వాలని ఒంగోలు రురల్ సీఐ నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యారు రాంగోపాల్ వర్మ. ఒంగోలు రురల్ పోలీస్ స్టేషన్లో వర్మను విచారిస్తున్నారు పోలీసులు. సాయంత్రం వరకు విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించి ఫిబ్రవరిలో పోలీసు విచారణకు హాజరైన వర్మ.. మళ్ళీ ఆరు నెలల తర్వాత పోలీసుల విచారణకు హాజరవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వ్యూహం సినిమా ప్రమోషన్స్ సమయంలో చంద్రబాబు, పవన్, నారా లోకేష్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ పోస్టులు పెట్టడంతో.. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 7న పోలీసు విచారణకు హాజరయ్యారు వర్మ. ఈ క్రమంలో ఒంగోలు పోలీసులు సుమారు 50 ప్రశ్నలతో వర్మను విచారించారు. మరి, ఆరు నెలల తర్వాత విచారణకు హాజరైన వర్మను పోలీసులు ఏ అంశాలకు సంబంధించి ప్రశ్నిస్తారో చూడాలి.