
రెండు సార్లు అమెరికా పర్యటనకు పోగానే పాక్ ఆర్మీ జనరల్ ఆసిమ్ మునీర్ అణు కూతలు కూస్తున్నారు. అమెరికా గడ్డమీద నుంచే భారత్ పై అణ్వాయుధాలతో దాడి చేస్తామని, తమను తక్కువగా అంచనా వేయెుద్దంటూ విర్రవీగాడు. తమ అస్థిత్వానికి ఇబ్బంది వస్తే.. తమతో పాటు సగం ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తామంటూ తన అధికారిక పర్యటనలో ప్రకటించటం ప్రకంపనలు సృష్టిస్తోంది.
విచక్షణ లేకుండా నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేయటం ప్రపంచ భద్రతకు ముప్పని మునీర్ వ్యాఖ్యలను ఖండించారు మాజీ భారత ఆర్మీ మేజర్ జనరల్ జిడి బక్షి. పిచ్చెక్కిన మునీర్ అణుదాడి చేస్తామంటూ బెదిరించటాన్ని బక్షి కొట్టిపడేశారు. అలాగే సిందు నదిపై నిర్మించే డ్యామ్ మిసైళ్లతో కూల్చేస్తామంటూ డప్పాలు బాదటం ఆయనను మరోసారి నవ్వులపాలు చేస్తోంది.
ALSO READ : మేం పోతే ఊరికే పోం..
ఇటీవల మే నెలలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ మిస్సేళ్లను భారత భద్రతా వ్యవస్థలు కూల్చేసిన విషయాన్ని మునీర్ మర్చిపోయారని అన్నారు బక్షి. సిందూర్ సమయంలో పాక్ మూడు బ్యాలెస్టిక్ మిస్సేళ్లను ప్రయోగించగా 100 శాతం వాటిని భారత్ అడ్డుకుందని అన్నారు. అలాగే పాక్ పంపిన వెయ్యి డ్రోన్లలో 90 శాతం నిరోధించబడ్డాయని బక్షి చెప్పారు. 3వ అణు యుగంలో ఇంటిగ్రేటెడ్ AD వ్యవస్థల పూర్తి సామర్థ్యం పాకిస్తాన్ వంటి చిన్న దేశాలు కలిగి ఉన్న అణ్వాయుధ స్థావరాలను మట్టికరిపిస్తాయని అన్నారు బక్షి.
ఈ పిచ్చి ముల్లా సగం ప్రపంచాన్ని తనతో తీసుకెళ్లకుండా అమెరికా నిరోధించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ జనరల్ బక్షి పిలుపునిచ్చారు. మునీర్ ప్రసంగం కాశ్మీర్ పై పెరుగుతున్న శత్రుత్వానికి అద్దం పడుతోంది. ఇంత నిర్లక్ష్యంగా ఒక దేశ ఆర్మీ చీఫ్ మాట్లాడటాన్ని భారత్ కూడా ఖండిస్తోంది. విదేశాలను బెదిరించటానికి పాక్ ఎప్పుడు పాత న్యూక్లియర్ దాడి పాడటాన్ని ప్రపంచ నేతలు కూడా తప్పుపడుతున్నారు. ఇదంతా చూస్తుంటే మునీర్ అమెరికా పర్యటనను మీడియా కవరేజ్ కోసం కారుకూతలు కూస్తున్నాడా అనే అనుమానాలను కూడా కొందరు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.