
Gold Price Today: అమెరికా టారిఫ్స్ వార్ భయాలు మెల్లమెల్లగా మార్కెట్ల నుంచి తొలగిపోతున్నాయి. ట్రంప్ ఎలాంటి ఒత్తిళ్లకు భారత్ తలొగ్గదని ప్రభుత్వం నుంచి వస్తున్న సంకేతాలతో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు కూడా సానుకూలంగా ముందుకు సాగుతున్నారు. ఇది బంగారం, వెండికి డిమాండ్ తగ్గిస్తోంది.
2025, ఆగస్ట్ 12వ తేదీ బంగారం ధరలు పరిశీలిస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర 11వ తేదీ పోల్చితే 10 గ్రాములకు 880 రూపాయలు తగ్గింపును నమోదు చేసింది. అంటే గ్రాముకు రూ.88 తగ్గింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో తగ్గిన గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే ఇవాళ ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల గ్రాము గోల్డ్ రేటు..
హైదరాబాద్: రూ.10వేల 140
వరంగల్: రూ.10వేల 140
కరీంనగర్: రూ.10వేల 140
విజయవాడ: రూ.10వేల 140
ప్రొద్దుటూరు: రూ.10వేల 140
వైజాగ్: రూ.10వేల 140
తిరుపతి: రూ.10వేల 140
22 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే ఆగస్టు 11తేదీతో పోల్చితే 10 గ్రాములకు ఆగస్టు 12వ తేదీన రూ.800 తగ్గింది. అంటే గ్రాముకు బంగారం రూ.80 తగ్గింపును చూసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో తగ్గిన గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే ఇవాళ ఇలా ఉన్నాయి.
22 క్యారెట్ల గ్రాము ధర..
హైదరాబాద్: రూ.9వేల 295
వరంగల్: రూ.9వేల 295
కరీంనగర్: రూ.9వేల 295
విజయవాడ: రూ.9వేల 295
ప్రొద్దుటూరు: రూ.9వేల 295
వైజాగ్: రూ.9వేల 295
తిరుపతి: రూ.9వేల 295
ఇక వెండి నిన్న అంటే ఆగస్టు 11వ తేదీతో పోల్చితే ఇవాళ ఆగస్టు 12న కేజీకి రూ.2వేలు తగ్గటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి రేటు రూ.లక్ష 25వేలుగా ఉంది. అంటే గ్రాము వెండి రేటు రూ.125 వద్ద కొనసాగుతోంది.
శ్రావణమాసం ప్రారంభం నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు రాఖీ పౌర్ణమి నాటి నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ట్రంప్ భారతదేశంపై టారిఫ్స్ రెండోసారి పెంచటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు మెుదలవ్వటమే బంగారం, వెండి రేట్లు పెరగటానికి దారితీసింది. కానీ ప్రస్తుతం ఇన్వెస్టర్లలో నమ్మకం పెరగటం, ఈక్విటీ మార్కెట్లు కూడా లాభాల్లోకి రావటంతో గోల్డ్ రేట్లు తిరిగి తగ్గుతున్నాయి. బంగారంపై పెట్టుబడి పెడుతున్న ఇన్వెస్టర్ల సంఖ్య తగ్గటం రేట్ల తగ్గింపుకు మరో కారణంగా ఉంది.