రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ముట్టడించిన తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్

రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ముట్టడించిన తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్

హైదరాబాద్ : ఖైరతాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ముట్టడించింది. ఓవర్ లోడ్ వేసుకుని వెళ్తేనే లారీలకు క్వారీ కాంట్రాక్టర్లు లోడ్ ఇస్తున్నారని లారీ ఓనర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా పదుల సంఖ్యలో లారీ ఓనర్స్ అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. క్వారీ కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఓవర్ లోడ్ కారణంగా ఆర్టీవోలు పెనాల్టీలు వేస్తున్నారని లారీ ఓనర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. పెనాల్టీల వల్ల యజమానాలు నష్టపోవాల్సి వస్తుందన్నారు. అలాగే.. పాసింగ్ రూల్స్ ప్రకారమే లోడ్ కు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్వారీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుండి బిల్లులు సమయానికి రాకపోవడం వల్ల ఓవర్ లోడ్ లు వేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి నిబంధనల ప్రకారం లోడ్ చేయించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అప్పటికే లారీ ఓనర్స్ ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.