
వెలుగుల పండగ దీపావళి రోజున ( అక్టోబర్ 20 వ తేదీన) అరుదైన యోగం ఏర్పడుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు.ఈ రోజున త్రిగ్రహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం గ్రహాలకు రాజు అయిన సూర్యుడు... వ్యాపార కారకుడు అయిన బుధుడు..ధైర్యం, క్రమశిక్షణకు ప్రతీక కుజుడుని కలవనున్నారు. దీంతో తులారాశిలో త్రిగ్రహి యోగం యోగం ఏర్పడుతుంది.ఈ యోగం ప్రభావంతో మూడు రాశుల వారి అదృష్టం వరిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ మూడు అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం
వృశ్చిక రాశి : బుధుడు.. కుజుడు.. సూర్యుడు కలవడం వలన ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యోగం లగ్నస్థానమైన తులారాశిలో ఏర్పడుతుంది. తత్ఫలితంగా ఈ రాశి వారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని.. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయవచ్చు. కష్టపడి పనిచేయడం వల్ల విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల పనితీరుకు ప్రశంశలు లభిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి : దీపావళి రోజున ( అక్టోబర్20) ఏర్పడే త్రిగ్రహి యోగం ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు మార్గాలు ఏర్పడతాయి. ము వ్యాపారస్తులకు ఈ సమయం శుభాసమయం. వ్యాపారంలో కొత్త ఒప్పందాలను చేసే అవకాశం ఉంది.పెట్టుబడుల నుంచి లాభాలను ఆర్జించవచ్చు. లాటరీ వ్యవహారాల్లో లాభం పొందే అవకాశాలు వచ్చే . చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. నిరుద్యోగులు శుభవార్తలను వింటారు.
సింహ రాశి : తులారాశిలో త్రిగ్రాహి యోగంవలన ఈ రాశి వారికి మంచి సమయం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు తమ పని, వ్యాపారంలో పురోగతిని పొందనున్నారు. కొత్త వ్యాపార అవకాశాలు లభించవచ్చు. పాత ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నవారు కోరుకున్న స్థానానికి బదిలీ చేయబడవచ్చు . కుటుంబ జీవితంలో సామరస్యాన్ని పెంచుతుంది. విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.