
హైదరాబాద్: సినీ నటుడు అక్కినేని నాగార్జున తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసి నాగార్జున పుష్ప గుచ్చం అందజేశారు. రాష్ట్ర కొత్త డీజీపీగా బి. శివధర్‌రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. 1994 బ్యాచ్ఐపీఎస్ అధికారి అయిన శివధర్‌రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన సంగతి తెలిసిందే.
2014-2016 మధ్య తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డి పనిచేశారు. 2016 లో జరిగిన గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించి, గుర్తింపు పొందారు. ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావోలో కూడా శివధర్‌రెడ్డి పనిచేశారు.
2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీసు కాల్పుల్లో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా శివధర్‌రెడ్డిని అప్పటి ప్రభుత్వం నియమించింది. అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఆ సమయంలో శాంతి భద్రతలను సమర్థంగా కాపాడిన అధికారిగా శివధర్‌రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు.
విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో రోడ్డు భద్రత కోసం ‘అరైవ్ ఎలైవ్..’ పేరిట క్యాంపెయిన్ నిర్వహించారు. ఉమ్మడి ఏపీలో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. పర్సనల్ వింగ్‌లో ఐజీ, అడిషనల్ డీజీగా, అడిషనల్ డీజీపీ రోడ్ సేఫ్టీ గా పనిచేశారు.