లోకల్ బాడీ ఎలక్షన్లలో ఇద్దరు పిల్లల రూల్ తొలగింపు: తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇవే

లోకల్ బాడీ ఎలక్షన్లలో ఇద్దరు పిల్లల రూల్ తొలగింపు: తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇవే

లోకబ్ బాడీ ఎన్నికలలో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.  సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం (అక్టోబర్ 16) ఏర్పాటైన కేబినెట్ మీటింగ్ లో  స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లతో పాటు కీలక అంశాలపై చర్చించారు. గత సర్కార్ తెచ్చిన ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసున్నారు. బీసీ కోటాపై న్యాయనిపుణుల సూచన మేరకే ముందుకెల్లాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల్లో న్యాయనిపుణుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది కేబినెట్. ఈ సందర్భంగా కేబినెట్ లో చర్చించిన అంశాలు, నిర్ణయాలను మంత్రి పొంగులేటి మీడియాకు వివరించారు.

కేబినెట్ నిర్ణయాలు:

  • ప్రజా ప్రభుత్వం ఏర్పాడి రెండేండ్లు గడుస్తున్న సందర్భంగా
  • డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలు
  • డిసెంబర్ 1 నుంచి 9 రోజుల వరకు ఉత్సవాలు
  • నల్సార్ యూనివర్సిటీకి ఏడు ఎకరాల కేటాయింపు
  • స్థానికులకు 25 శాతం 50 శాతానికి పెంపు
  • రాష్ట్రంలో కొత్తగా మూడు అగ్రికర్చరల్ కాలేజీలకు మంత్రివర్గ ఆమోదం
  • అత్యంత అధునాతన సౌకర్యాలతో కాలేజీలు
  • హుజుర్ నగర్, కొడంగల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో వ్యవసాయ కాలేజీలు
  • వానాకాలంలో 1.48  లక్షల ఎకరాల్లో ధాన్యం  సేకరణ
  • ఈ సీజన్ లో 80 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారు
  • ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ ఇంత దిగుబడి రాలేదు
  • కేంద్రం సహకరించినా సహకరించకపోయినా రైతు పండించిన ప్రతి గింజను కొంటాం
  • మద్ధతు ధరతో పాటురూ.500 బోనస్
  • రైతును రాజును చేయడమే లక్ష్యం