కోర్టు విచారణ లైవ్..మహిళను ముద్దు పెట్టుకున్న లాయర్.. వీడియో వైరల్

కోర్టు విచారణ లైవ్..మహిళను ముద్దు పెట్టుకున్న లాయర్.. వీడియో వైరల్

ఢిల్లీ హైకోర్టుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది..అదేదో సంచలన తీర్పుకు సంబంధించిందో..  జడ్జి  న్యాయవాదినో, లేక నిందితుడినే మందలించిన వీడియో కాదు.. ఆన్​ లైన్​ ఓ లాయర్​అనుచిత ప్రవర్తనకు సంబంధించింది. ఈ వీడియో  నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. 

ఆ ఫుటేజీలో న్యాయవాది కోర్టు దుస్తుల్లో ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. తన గదిలో కూర్చుని లైవ్​ కెమెరా ముందు  మహిళ చేతిని లాగి తన వైపుకు లాగుతున్నట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆమె వద్దు వద్దు అంటుంటే.. న్యాయవాది మాత్రం  ఆగకుండా ఆమెకు ముద్దు పెట్టినట్లు వీడియోలో కనిపిస్తుంది. 

వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా  ఢిల్లీ హైకోర్టు అనే క్యాప్షన్‌తో వీడియోను తిరిగి షేర్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే 90వేల మంది చూశారు. వీడియోలో ముఖం కనిపించని న్యాయవాదిని, ఆ మహిళ ఎవరనేది ఇంకా  గుర్తించలేదు. 

ఇక నెటిజన్లు  తమదైన శైలీలో స్పందించారు. ఆయన న్యాయమూర్తి.. కాదు.. న్యాయవాదిలా కనిపిస్తున్నారు. ఇది జస్టిస్​ ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలోని జ్యోతిసింగ్​ కోర్టు.. అప్పుడు కోర్టు సెషన్​ లో లేదు అన్నారు సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు న్యాయవాది కుమార్​ దీప్రాజ్ రిప్లై ఇచ్చారు. 
 ఈ సంఘటన మంగళవారం జరిగిందని , కోర్టు సెషన్​ లో లేదని , న్యాయమూర్తి రాకకోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.  గతంలో ఇలాంటిదే గుజరాత్ హైకోర్టు విచారణలో కూడా జరిగింది. ఓ వ్యక్తి బాత్రూం నుంచి గుజరాత్ హైకోర్టు వర్చువల్​ మీటింగ్​ లో  పాల్గొన్నాడు. ఆ వ్యక్తికి గుజరాత్ హైకోర్టు రూ.1 లక్ష జరిమానా ,15 రోజుల సమాజ సేవ చేయాలని ఆదేశించింది.