ICC ODI rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. కోహ్లీ, రోహిత్‌లను వెనక్కి నెట్టిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్

ICC ODI rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. కోహ్లీ, రోహిత్‌లను వెనక్కి నెట్టిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్  ఇబ్రహీం జద్రాన్ దూసుకొచ్చాడు. ఐసీసీ గురువారం (అక్టోబర్ 15) ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో జద్రాన్ టీమిండియా స్టార్  బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను వెనక్కి నెట్టడం విశేషం. పాకిస్థాన్ స్టార్ బాబర్ ను కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ అధిగమించాడు. గత ఏడాది కాలంగా వన్డేల్లో నిలకడగా ఆడుతున్న ఇబ్రహీం జద్రాన్ ఇటీవలే బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లో తన బ్యాటింగ్ తో దుమ్ములేపాడు. తొలి వన్డేల్లో 23 పరుగులే చేసినా రెండు, వన్డేల్లో వరుసగా 95, 95 పరుగులు చేసి సత్తా చాటాడు. 

ఓవరాల్ గా మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ 213 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. టీమిండియా కొత్త వన్డే కెప్టెన్ శుభమాన్ గిల్ అగ్ర స్థానంలోనే కొనసాగుతున్నాడు. గిల్ కు జద్రాన్ మధ్య కేవలం 20 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఆస్ట్రేలియా సిరీస్ లో రోహిత్, కోహ్లీ, గిల్ విఫలమైతే జద్రాన్ టాప్ కు చేరుకోవచ్చు. అదే జరిగితే వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకున్న తొలి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ గా చరిత్ర సృష్టిస్తాడు. జద్రాన్ రెండో ర్యాంక్ కు చేరడంతో రోహిత్ శర్మ మూడో ర్యాంక్ కు కోహ్లీ నాలుగో ర్యాంక్ కు పడిపోయాడు. బాబర్ అజామ్ ఐదో ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. 

ఇతర ఇండియన్ బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ 9వ స్థానంలో నిలిచాడు. జద్రాన్ తో పాటు రషీద్ ఖాన్, ఒమర్జాయ్ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ కు చేరుకోవడం విశేషం. రషీద్ ఖాన్ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో టాప్ కు చేరుకున్నాడు. రషీద్ ఏకంగా 5 స్థానాలు ఎగబాకి టాప్ కు చేరుకోవడం హైలెట్ గా మారింది. బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లో రెండో వన్డేలో 5 వికెట్లు పడగొట్టిన రషీద్.. మూడో వన్డేలో 3 వికెట్లు పడగొట్టాడు. ఓమర్జాయ్ ఆల్ రౌండే షో తో అదరగొట్టి ఆల్ రౌండ్ర్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.