తుక్కుగూడలో జరిగిన జనజాతర సభలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, దీపాదాస్ మున్నీ పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను న్యాయ పత్ర్ పేరుతో రాహుల్ విడుదల చేశారు. ర్యాంప్ పై నడుచుకుంటూ రాహుల్ ప్రజలకు అభివాదం చేశారు. ఈ సభకు భారీగా జనాలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోతోపాటు తెలంగాణకు 23 ప్రత్యేక హామీలు ప్రకటించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని రాహూల్ గాంధీ హామీ ఇచ్చారు.
రాష్ట్రానికి నాలుగు కొత్త సైనిక స్కూల్
క్రీడా విశ్వవిద్యాలయం
ఇండస్ట్రియల్ కారిడార్
పాలమూరుకు జాతీయ హోదా
మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాల అమలు హామీ
ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన 5 గ్రామాలను మళ్లీ తెలంగాణాలో కలుపుతాం
తెలంగాణాలో సుప్రీం కోర్టు బెంట్ ఏర్పాటు